అమ్ముడుపోయారా? : ఆప్ | aap fires on andhra government | Sakshi
Sakshi News home page

అమ్ముడుపోయారా? : ఆప్

Feb 28 2014 1:49 AM | Updated on Apr 4 2018 7:42 PM

కేజీ బేసిన్ గ్యాస్ ధరలపై రిలయన్స్ కంపెనీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజలపై పెనుభారం పడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది.

సాక్షి, హైదరాబాద్: కేజీ బేసిన్ గ్యాస్ ధరలపై రిలయన్స్ కంపెనీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజలపై పెనుభారం పడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను రిలయన్స్ అధినేతలైన అంబానీలు గుప్పిట్లో పెట్టుకొన్నారని ఆ పార్టీ ఆరోపించింది. గురువారమిక్కడ ఆప్ నేతలు కిరణ్‌కుమార్, చక్రిలతో కలిసి రాష్ట్రశాఖ కన్వీనర్ బి. రామకృష్ణంరాజు విలేకరులతో మాట్లాడారు.
 
  రాష్ట్ర ప్రజలపై రూ. 4 వేల కోట్ల భారం పడే గ్యాస్ ధర పెంపుదలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అంబానీకి అమ్ముడుపోయారా అంటూ ప్రశ్నించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement