వ్యక్తి ఆత్మహత్య | A man commits suicide | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Oct 29 2015 5:41 PM | Updated on Nov 6 2018 7:56 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదన్ పల్లి శివారుల్లో చెట్టుకు ఉరేసుకుని టి వెంకటేశ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని మదన్‌పల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్టుకు గురువారం మృతదేహం వేలాడుతూ కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


ఘటన జరిగి చాలా రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృత దేహం పూర్తిగా కుళ్లి పోయిందని.. కేవలం అస్తి పంజరం మాత్రమే మిగిలిందని తెలిపారు. మృతుడు గ్రామానికి చెందిన టి. వెంకటేశ్(45)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement