రాష్ట్రంలో వివిధ రకాల కాలుష్య నియంత్రణ, నివారణపై ప్రభుత్వం దృష్టి సారిం చింది. కాలుష్యంతో ముడిపడిన అంశాలకు సంబం ధించిన సవాళ్లను
పీసీబీలో 65 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
Nov 11 2016 3:48 AM | Updated on Sep 4 2017 7:44 PM
టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ రకాల కాలుష్య నియంత్రణ, నివారణపై ప్రభుత్వం దృష్టి సారిం చింది. కాలుష్యంతో ముడిపడిన అంశాలకు సంబం ధించిన సవాళ్లను అధిగమించాలని నిర్ణయించింది. ముందుగా కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని బలోపేతం చేసి, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిద్ధం చేయాలని భావిస్తోంది. దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్రాంగాన్ని, సిబ్బందిని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. దానిలో భాగంగా పీసీబీలో పోస్టుల భర్తీని చేపట్టి, కాలుష్య నియంత్రణ చర్యలను చేపట్టనుంది.
శాస్త్ర సాంకేతిక, మానవ వనరుల పెంపు దలకు ప్రాధాన్యతనివ్వనుంది. వివిధ రకాల వాయు, జల నాణ్యత కేంద్రాల నుంచి వచ్చిన సమాచారం, వివరాలను విశ్లేషించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలనే ఆలోచనతో ఉంది. త్వరలోనే నోటిఫికేషన్: పీసీబీకి అవసరమైన 65 పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీకి అటవీ, పర్యావరణ శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్-26, అనలిస్ట్‌లు- 24, మినిస్టీరియల్ సిబ్బంది-15 పోస్టులకు గానూ త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement