రైలు ఢీకొని 57 గొర్రెలు మృతి చెందిన వికారబాద్ శివారులోని కొత్తగడి వద్ద చోటుచేసుకుంది.
రైలు ఢీకొని 57 గొర్రెలు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా వికారబాద్ పట్టణ శివారులోని కొత్తగడి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోర్రెల కాపరి రైలు పట్టాల సమీపంలో గోర్రెలను మేపుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్లే పూర్ణ ప్యాసింజర్ గోర్రెల మందను ఢీకొంది. ఈ ఘటనలో 57 గొర్రెలు మృతిచెందగా.. మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తంచేశాడు.