నగరంలోని జీడిమెట్లలోని సాయిసుధా స్కూల్ బస్సు కింద పడి జశ్వంత్(4) అనే చిన్నారి మృతి చెందాడు.
హైదరాబాద్: నగరంలోని జీడిమెట్లలోని సాయిసుధా స్కూల్ బస్సు కింద పడి జశ్వంత్(4) అనే చిన్నారి మృతి చెందాడు. జశ్వంత్ అదే స్కూల్లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. బస్సును రివర్స్ తీసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.