జీహెచ్ ఎంసీలో సమగ్ర కుటుంబ సర్వే కంప్యూటరీకరణ పూర్తయింది. గ్రేటర్ పరిధిలో ఎన్‌ఐసీ అంచనాల ప్రకారం దాదాపు 20.36 లక్షల కుటుంబాలున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు.
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ ఎంసీలో సమగ్ర కుటుంబ సర్వే కంప్యూటరీకరణ పూర్తయింది. గ్రేటర్ పరిధిలో ఎన్‌ఐసీ అంచనాల ప్రకారం దాదాపు 20.36 లక్షల కుటుంబాలున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆగస్టు 19న సర్వే జరగ్గా, ఆ తర్వాత మరో రెండు మూడు రోజుల వరకు కూడా ప్రజలు తమ వివరాలు అందించారు. 22 లక్షలకుపైగా కుటుంబాలున్నట్లు అప్పట్లో అంచనా వేశారు. కొన్ని కుటుంబాల వివరాలు డబుల్ ఎంట్రీ కావడం తదితర కారణలతో కంప్యూటరీకరణ పూర్తయ్యేసరికి కుటుంబాల సంఖ్య తగ్గింది. కాగా, తమ వివరాలు నమోదు కాలేదని ఎదురు చూస్తున్న కుటుంబాలు సైతం నగరంలో ఇంకా భారీ సంఖ్యలో ఉన్నాయి. మరోమారు సర్వే జరిపితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
బతుక మ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు
బతుకమ్మ పండుగకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్‌సాగర్ నీటి వరకు నడచుకుంటూ వెళ్లేందుకు వీలుగా మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.