వడదెబ్బతో 19 మంది మృతి | 19 died of sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో 19 మంది మృతి

Apr 4 2016 1:50 AM | Updated on Sep 3 2017 9:08 PM

వడదెబ్బకు ఆదివారం తెలంగాణలో 13 మంది, ఏపీలో ఆరుగురు మృతి చెందారు.

సాక్షి నెట్‌వర్క్: వడదెబ్బకు ఆదివారం తెలం గాణలో 13 మంది, ఏపీలో ఆరుగురు మృతి చెందారు. వరంగల్ జిల్లా నెక్కొండ మం డలం దీక్షకుంటకు చెందిన ముడ్సు చంద్రయ్య(65), రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన ముద్రబోయిన వెంకటనర్సు(50), నర్సింహులపేట మండలం దంతాలపల్లికి చెందిన సయ్యద్ యాకూబ్(70), మంగపేట మండలం రాజుపేటకు చెందిన యర్రం ప్రమీలరాణి(79)లు చనిపోయారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ శాంతినగర్‌కు చెందిన చేతుల రాఘవులు(60), సత్తుపల్లిలోని వెంగళరావు నగర్‌కు చెందిన ఊటు కూరి జగన్నాథరావు(65), తల్లాడకు చెందిన కుసుమరాజు నాగభూషణం(80), ఏన్కూర్ మండలం శ్రీరాంపురం తండాకు చెందిన బానోతు గోలియా(55)లు వడదెబ్బతో చని పోయారు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో పోస్ట్‌మ్యాన్ వడ్నాల దేవయ్య(55), పెద్దపల్లి మండలం నిట్టూరుకు చెందిన ఆకుల లక్ష్మి(63) వడదెబ్బతో అస్వస్థతకు గురై మరణించారు.  
 
 మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలం నీలపల్లి గ్రామానికి చెందిన అడ్డాకుల దుబ్బన్న (65),  కోడేరు మండలం జనుంపల్లిలో ఇంటర్ విద్యార్థిని మంజుల (17),  ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన గుంతపాటి కతలప్ప (65) వడదెబ్బకు గురై మృతి చెందారు.
 
 ఏపీలో ఆరుగురు..: విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం చింతల పాడుకు చెందిన రైతు కోలక నాగేశ్వరరావు(41), ఇదే జిల్లా జామిలో రెడ్డి సత్యం(43), తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండ లం అంకంపాలేనికి  చెందిన ఎస్.రాముడు(70), అనంతపురం జిల్లా గుత్తి ఆర్‌ఎస్ ఎస్సీ కాలనీకి చెందిన విమలమ్మ(55), నార్పల మండలం రంగాపురానికి చెందిన కె.రామకృష్ణ(70), చిత్తూరు జిల్లా సదుం మండలం కలికిరివాండ్లపల్లెకు చెందిన గోవిందమ్మ (68) వడదెబ్బతో మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement