బీసీలకు 10 వేల కోట్లు కేటాయించండి | 10,000 crore should grant for BCs | Sakshi
Sakshi News home page

బీసీలకు 10 వేల కోట్లు కేటాయించండి

Feb 9 2018 1:43 AM | Updated on Feb 9 2018 1:43 AM

10,000 crore should grant  for BCs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న బడ్జెట్‌లో బీసీలకు రూ.10 వేల కోట్ల కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే బీసీ కుల వృత్తుల ఫెడరేషన్లకు జనాభా ప్రాతిపదికన నిధులివ్వాలని కోరారు. గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కలసి 16 డిమాండ్లపై వినతి పత్రం సమర్పించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement