ఈ టీచర్‌ను భార్యే అంతం చేసింది..


నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పడ్‌గాల్ గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన టీచర్ హత్య కేసులో అతడి భార్యే నిందితురాలని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు బుధవారం వెల్లడించిన వివరాల మేరకు... సూత్రాల గంగాధర్ అనే ఉపాధ్యాయుడు సోమవారం హత్యకు గురయ్యాడు. గంగాధర్ పెట్టే వేధింపులు భరించలేక అతడి భార్య గంగామణి బండరాయితో మోది చంపినట్టు పోలీసులు తేల్చారు. బుధవారం నిందితురాలు గంగామణిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 
 

Read also in:
Back to Top