పుష్కర దారుల్లో ట్రాఫిక్ జామ్ | traffic jam in dharmapuri | Sakshi
Sakshi News home page

పుష్కర దారుల్లో ట్రాఫిక్ జామ్

Jul 22 2015 11:45 AM | Updated on Aug 1 2018 5:04 PM

కరీంనగర్ జిల్లాల్లోని ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల ఘాట్లకు బుధవారం భక్తులు పోటెత్తారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లాల్లోని ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల ఘాట్లకు బుధవారం భక్తులు పోటెత్తారు. ఫలితంగా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ధర్మపురి మార్గంలో 15 కిలోమీటర్లు, కాళేశ్వరం మార్గంలో 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ముందుకు కదిలే పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంగటలకే ధర్మపురిలో 3.50 లక్షలు, కాళేశ్వరంలో 2.50 లక్షలు, కోటిలింగాల ఘాట్‌లో 1.20 లక్షల మంది పుణ్య స్నానాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement