పట్టణపాలనలో నెంబర్‌వన్‌ ఆ రాష్ట్రానిదే


తిరువనంతరపురం: పట్టణ పరిపాలనలో కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం ప్రథమ స్ధానాన్ని సంపాదించింది. దేశంలోని 21 నగరాలు పట్టణ పరిపాలనలో చేపడుతున్న కార్యక్రమాల ఆధారంగా జనాగ్రహ సెంటర్‌ ఫర్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ డెమొక్రసీ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో తిరువనంతపురానికి మొదటి స్ధానం దక్కగా.. ఆ తర్వాతి స్ధానాల్లో పుణె, కోల్‌కతా, ముంబైలు ఉన్నాయి. కాగా, పట్టణపరిపాలనలో ఢిల్లీ తొమ్మిదో స్ధానంలో నిలవగా, చండీఘడ్‌ ఆఖరి స్ధానంతో సరిపెట్టుకుంది.

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top