ఆత్మహత్య కాదు.. హత్య..


అనుమానాస్పద స్థితుల్లో మృతి చెందిన మహిళ మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేశారు. సంఘటన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వేముల నాగమణి ఈనెల 13వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఆమె మృతదేహాన్ని ఖననం చేశారు.


అయితే, అది ఆత్మహత్య కాదు..హత్య అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె సోదరి పుష్పలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు...నాగ మణితో సన్నిహితంగా మెలిగే శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నాగమణిని తనే ఉరి వేసి చంపినట్లు అతడు అంగీకరించాడు. ఈ మేరకు మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిర్వహించారు.


Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top