జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో శనివారం ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు.
పుల్వామా: జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో శనివారం ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. కాల్పుల్లో ఓ వర్తకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చేపడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.