గుంటూరు జిల్లా బాపట్లలోని వ్యవసాయ కళాశాల విద్యార్థులు యాజమాన్య తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు.
బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలోని వ్యవసాయ కళాశాల విద్యార్థులు యాజమాన్య తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న సూర్యారావు(22) మృతిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ విచారణ చేపట్టి నివేదిక ఇచ్చింది. అయితే నివేదికలో ఉన్న అంశాలను బయటపెట్టాలని విద్యార్థులు కోరారు. అందుకు కళాశాల యాజమాన్యం స్పందించలేదు. అయితే కాలేజ్, హాస్టళ్లను మూసివేస్తున్నట్టు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉత్తర్వులు జారీ చేయడంపై విద్యార్థులు అసోసియేషన్ చాంబర్ ఎదుట ధర్నా చేపట్టారు. కాలేజ్ లోని మొత్తం 903 విద్యార్థులకు భోజన సదుపాయం నిలిపివేయడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కాలేజ్ లో ఐసీఏఆర్ నుంచి వివిధ రాష్ట్రాల 90 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారు ఇప్పడు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మామూలు సమయంలో ఇంటికి వెళ్లాలంటే రెండు నెలల ముందు రిజర్వేషన్ చేసుకోవాలని , ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదని విద్యార్థుల ఆవేదన చెందుతున్నారు.