విశాఖ ఏజెన్సీలో స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు | slight temperature rise in visakha agency | Sakshi
Sakshi News home page

విశాఖ ఏజెన్సీలో స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు

Jan 27 2016 8:28 AM | Updated on Aug 20 2018 3:54 PM

విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు బుధవారం స్పల్పంగా పెరిగాయి.

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు బుధవారం స్పల్పంగా పెరిగాయి. అరకు 10 డిగ్రీలు, లంబసింగిలో 12 డిగ్రీలు,
చింతపల్లిలో 15 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.

అలాగే చలి తీవ్రత రోజురోజుకి పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డారు. కానీ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement