బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. ఐదుదశల ఎన్నికలలో భాగంగా సోమవారం 10 జిల్లాలలోని 49 స్థానాలకు తొలిదశ పోలింగ్ పూర్తయింది. సమస్యాత్మక ప్రాంతాలలో పోలింగ్ మూడు గంటలకే ముగియగా, సాధారణ పరిస్థితులు గల ప్రాంతాలలో 5 గంటల వరకు కొనసాగింది. తొలిదశ పోలింగ్లో 57 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా 2010లో ఇక్కడ పోలింగ్ కేవలం 50.85 శాతం నమోదైంది. తొలిదశలో 49 స్థానాలలో 583 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.