'ప్రత్యేకం' కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం | man-attempts-suicide-for-special-status-to-andhra-pradesh | Sakshi
Sakshi News home page

'ప్రత్యేకం' కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Aug 26 2015 9:51 AM | Updated on Mar 23 2019 9:10 PM

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది.

తాడేపల్లిగూడెం:  పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని చేబ్రోలు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం సుందరపు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వంటిపై కిరోసిస్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశాడు.

స్థానికులు మంటలను ఆర్పి అతడ్ని చికిత్స కోసం తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రసాద్ చేబ్రోలులోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్ధాపంతో ఆత్మహత్మకు పాల్పడినట్టు దుర్గాప్రసాద్ చెబుతున్నాడు. ప్రస్తుతం దుర్గాప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement