‘చెరువుల అభివృద్ధికి భారీగా నిధులు’ | Hugh funds for development of the pond :Mahendar reddy | Sakshi
Sakshi News home page

‘చెరువుల అభివృద్ధికి భారీగా నిధులు’

Apr 15 2016 4:39 PM | Updated on Mar 28 2018 11:26 AM

తెలంగాణ సర్కారు చెరువుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ సర్కారు చెరువుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండల కేంద్రంలో మిషన్ కాకతీయ కింద రూ.66 లక్షలతో మంజురైన ఊర చెరువు పనులను ప్రారంభించారు.

 ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం సాగునీటి రంగఅభివృద్ధికి ఊతమిస్తోందని అన్నారు. పూడిక తీతతో చెరువులు పుష్కలంగా నిండి ఏడాదికి రెండు పంటలు పండే అవకాశం ఉందని తెలిపారు. మండలంలోని 39 చెరువులకు రూ.17కోట్లు, తాండూరు- తోర్మామిడి రోడ్డు పనులకు రూ.27 కోట్ల నిధులు, తాండూరు రింగ్ రోడ్డు సర్వేకు రూ.80 కోట్లు మంజూరయ్యాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement