సత్యసాయి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తులు శనివారం ఘనంగా నిర్వహించనున్నారు.
పుట‍్టపర్తిలో నేడు సత్యసాయి గిరిప్రదక్షిణ
Mar 11 2017 9:39 AM | Updated on Sep 5 2017 5:49 AM
అనంతపురం: సత్యసాయి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తులు శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వద్ద సత్యసాయి చిత్ర పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణను ప్రారంభించనున్నారు. గోకులం, ఎనుములపల్లి గణేష్ సర్కిల్, ఆర్‌వీజే పెట్రోల్ బంక్, చింతతోపులు మీదుగా పట్టణంలో ప్రవేశించి మంగళహారతితో ముగుస్తుంది. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Advertisement
Advertisement