కేసీఆర్‌తో యుద్ధం మొదలైంది: ఎర్రబెల్లి | errabelli dayakar rao fires on cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌తో యుద్ధం మొదలైంది: ఎర్రబెల్లి

Jul 24 2015 3:16 AM | Updated on Aug 15 2018 9:27 PM

కేసీఆర్‌తో యుద్ధం మొదలైంది: ఎర్రబెల్లి - Sakshi

కేసీఆర్‌తో యుద్ధం మొదలైంది: ఎర్రబెల్లి

‘కేసీఆర్‌పై యుద్ధం మొదలైంది.. 6 నెలలు ఓపిక పట్టండి.. టీఆర్‌ఎస్‌ను తుక్కుతుక్కుగా ఓడిస్తాం.. ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే నాలుగేళ్లు ఏమీ మాట్లాడం..

సత్తుపల్లి : ‘కేసీఆర్‌పై యుద్ధం మొదలైంది.. 6 నెలలు ఓపిక పట్టండి.. టీఆర్‌ఎస్‌ను తుక్కుతుక్కుగా ఓడిస్తాం.. ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే నాలుగేళ్లు ఏమీ మాట్లాడం.. రాజకీయ సన్యాసం తీసుకుంటాం’ అని టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం రాత్రి టీడీపీ ఎమ్మెల్యేల బృందం సండ్ర వెంకటవీరయ్యకు సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ మా పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొన్నప్పుడు కేసు కాదు..

మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్వయానా డబ్బుల కోసమే పార్టీ మారుతున్నానని చెప్పారు, అయినా కేసు కాలేదన్నారు. పార్టీ మారాలని నాతోపాటు ప్రకాష్‌గౌడ్, సండ్ర వెంకటవీరయ్య వెంటపడ్డారని, లొంగక పోయేసరికి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని ఆరోపించారు. సండ్ర మాట్లాడుతూ రాజకీయంగా నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి,  ప్రకాష్‌గౌడ్,  మాగంటి గోపినాథ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి బ్రహ్మయ్య, మెచ్చా నాగేశ్వరరావు, వాసిరెడ్డి రామనాథం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement