శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు | director sampath nandi visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Oct 30 2015 10:22 AM | Updated on Sep 3 2017 11:44 AM

దక్షిణ మధ్య రైల్వే నూతన జీఎంగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన రవీంద్ర గుప్తా తన కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

తిరుమల: దక్షిణ మధ్య రైల్వే నూతన జీఎంగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన రవీంద్ర గుప్తా తన కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్న గుప్తా కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

అలాగే, సినీ దర్శకుడు సంపత్‌నంది కూడా తన కుటుంబ సభ్యులతో కలసి స్వామిని దర్శించుకున్నారు.  ఛత్తీస్‌గఢ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి రామ్ సీలా సాహు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీవీ రెడ్డి, ఎమ్మెల్సీ వీవీసీ చౌదరి, మాల మహానాడు జాతీయ కార్యదర్శి కారెం శివాజీతదితరులు కూడా స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement