రోడ్డు ప్రమాదంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతి | asst. professor dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతి

Dec 25 2015 3:17 PM | Updated on Sep 28 2018 3:41 PM

బైక్ పై వెళ్తున్నవ్యక్తి రోడ్డు పక్కన ఉన్న దిమ్మెను ఢీ కొట్టిన ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

హైదరాబాద్: బైక్ పై వెళ్తున్నవ్యక్తి రోడ్డు పక్కన ఉన్న దిమ్మెను ఢీ కొట్టిన ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పేట్ బషీర్‌బాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దూలపల్లి లో శుక్రవారం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న వ్యక్తి బైక్ పై వెళ్తుండగా.. బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న దిమ్మను ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement