యూజీసీ నిబంధనల మేరకు వేతనాలు ఇవ్వడం లేదంటూ తెలంగాణ వైద్య విద్య విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాబూరావు రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ను ఆశ్రయించారు.
సాక్షి, హైదరాబాద్: యూజీసీ నిబంధనల మేరకు వేతనాలు ఇవ్వడం లేదంటూ తెలంగాణ వైద్య విద్య విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాబూరావు రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ను ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది లక్ష్మీనరసింహం వాదనలు వినిపించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్ సభ్యుడు రత్నకిషోర్... కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారుకు నోటీసులు జారీచేశారు.