పురాతన శివలింగాన్ని రాయి అనుకుని..


నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని ఓ ఇంట్లో పురాతన శివలింగం లభ్యమైంది. అయితే, పదిహేనేళ్ల క్రితమే వెలుగు చూసినా అది శివలింగమని వారికి తెలియకపోవడంతో ఇన్నాళ్లూ మరుగునపడి ఉంది. ఎలుగూరి వెంకటేశ్వర్లు పాత ఇంటిని తొలగించే క్రమంలో 15 ఏళ్ల క్రితం ఓ రాయి బయటపడింది. కొబ్బరికాయలు కొట్టేందుకు పనికి వస్తుందని దాన్ని దాచిపెట్టారు. సోమవారం ఇంట్లో పూజల సమయంలో కొబ్బరికాయ కొట్టేందుకు ఆ రాయిని తీసుకురాగా, అది శివలింగమని పురోహితులు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. అసలు విషయం తెలియడంతో ప్రత్యేక పూజలు చేశారు. ఆ శివలింగాన్ని ఏదో ఒక శివాలయానికి తరలించాలని నిర్ణయించారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top