సాధ్వి ప్రజ్ఞ (బీజేపీ అభ్యర్థి)..రాయని డైరీ

Sadhvi Pragya Rayani Diary By Madhav Singaraju - Sakshi

మాధవ్‌ శింగరాజు

మే పన్నెండున భోపాల్‌ పోలింగ్‌. ప్రచారానికి తగినంత సమయం ఉన్నట్లేమీ కాదు. అయినప్పటికీ, ఉగ్రవాదుల తూటాలకు బలైన హేమంత్‌ కర్కరేను అమరవీరుడేనని కీర్తించడానికి నేను గత రెండు రోజులుగా నా ప్రచారసభలలో ఎక్కువ సమయం కేటాయిం చవలసి వస్తోంది. ఇది నేను కొనితెచ్చుకున్న పరిస్థితేమీ కాదు. విధి కొన్నిసార్లు అలా జరిపిస్తుంది. 

భోపాల్‌లో ముప్పై ఏళ్లుగా వరుసగా బీజేపీ వస్తోంది. తొలిసారి బీజేపీ వచ్చినప్పుడు నా వయసు ఏడాది. ముప్పై ఏళ్ల బీజేపీకి ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతిగా నేను పోటీ చేస్తున్నాను. ఇక్కడి నుంచి మరో ముప్పై ఏళ్లయినా నేను, నాతో పాటు బీజేపీ విజయం సాధిస్తూ పోవాలి. మోదీ ఆకాంక్ష అది. 

మోదీ ఆకాంక్షను నెరవేర్చడం కోసం భోపాల్‌ ఎంపీగా గెలిచి తీరడం అన్నది నేను ఆచరిస్తున్న హైందవ ధర్మంలోని ఒక కనీసం విధి మాత్రమే. ఆ మాత్రమైనా నా విధిని నేను నిర్వహించే దారిలో అవరోధాలు సృష్టించ డానికి నా ప్రత్యర్థి దిగ్విజయ్‌ సింగ్, ఆయన్ని నిలబెట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. అశోక చక్ర అవార్డు గ్రహీత హేమంత్‌ కర్కరే ఆత్మను ఆశ్రయించడం నా మనసుకు బాధ కలిస్తోంది. ‘నా శాపంతోనే కర్కరే బలి అయ్యారు’ అని ఆవేదనతో నేను అన్న మాటను ఒక జాతి విద్రోహ వ్యాఖ్యగా చిత్రీకరించి వీళ్లంతా తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూడడం ఏమంత సముచితం?!

జాతి విద్రోహం అంటే దేశ విద్రోహమే కదా. దేశ విద్రోహం అంటే హైందవ విద్రోహ మేగా! హైదవ సాధ్విని నేను. నేనెందుకలా నన్ను నేను విద్రోహించుకుంటాను. ఆ మాత్రం ఆలోచించరా?
సాధువు గానీ, సాధ్వి గానీ.. రాగద్వేషా లకు, భావోద్వేగాలకు అతీతమైనవారు. అయితే మాలెగావ్‌ పేలుడు కేసులో ముంబై జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని ఒక సాధ్విగా నేనిప్పుడు నా నియోజక వర్గ ప్రజల దృష్టికి తీసుకురాలేదు. ఆనాటి ఇరవై ఏళ్ల బాధిత యువతిగా మాత్రమే మాట్లాడాను.

అవును శపించాను. ఆ రోజు కర్కరేకు, నాకు  మధ్య జైల్లో జరిగిన సంభాషణే కర్కరేను నేను శపించేలా చేసింది. అయితే పైకేమీ నేను శపించలేదు. కమండలంలోని నీళ్లు ఆయన నెత్తిపై చల్లేమీ శపించలేదు. మనసులోనే శపించాను. శపించినట్లు ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడైనా శపించా నని చెప్పలేదు. శాపానికి గురయ్యేలా కర్కరే నన్ను ఎంత హింసించిందీ చెప్పాను. ఒక సాధ్వి పడిన హింసను పక్కన పెట్టి, ఒక సాధ్వి పెట్టిన శాపం గురించే అంతా మాట్లాడుతున్నారు. 

నిర్బంధంలో ఉన్న ఇరవై ఏళ్ల ఆడపిల్ల.. తనెంత సాధ్వి అయినా.. శపించడం తప్ప ఏం చేయగలదు?! ఉగ్రవాదుల దగ్గర బాంబులు ఉంటాయి. పోలీసుల దగ్గర తూటాలు ఉంటాయి. రాజకీయ నాయకుల దగ్గర మాటలు ఉంటాయి. అవమానంతో క్షోభిస్తున్న స్త్రీ హృదయంలో శాపనార్థాలు తప్ప ఏముంటాయి?!

నిజం చెప్పమంటాడు కర్కరే! ‘పేలుళ్లతో నాకు సంబంధం లేదన్నదే నిజం’ అన్నాను. నమ్మలేదు. ‘సంబంధం ఉన్నదీ లేనిదీ ఆ దేవు డికి తెలుసు’ అన్నాను. ‘అంటే ఏంటి! నేనిప్పుడు దేవుడి దగ్గరకు వెళ్లి తెలుసుకోవాలా?!’ అని బెల్టు తీశాడు. సాధ్వి తిరగబడ గలదా? దేవుణ్ణి వేడుకుంటుంది. నేను చేసిందీ అదే.

‘ఆప్‌ కి అదాలత్‌’ షోలో రజత్‌ శర్మ నన్ను ఒకమాట అడిగారు. ‘రాజకీయాల్లోకి వస్తు న్నారా?’ అని. దేశం కోరుకుంటే వస్తాను అన్నాను.  ఆయనే ఇంకో మాట.. రాహుల్‌ గాంధీ గురించి.. అడిగారు. ‘స్మాల్‌ చైల్డ్‌’ అని అన్నాను. నా వంటి పరిత్యాగులకు ఏదీ పెద్ద విషయంగా అనిపించదు. ఎవరూ పెద్ద నాయ కులుగా అనిపించరు. మోదీ ఇందుకు అతీతం. ఆయన నాయకుడే అయినప్పటికీ ఈ దేశంలో అందరికన్న పెద్ద పరిత్యాగి.

మరిన్ని వార్తలు

24-05-2019
May 24, 2019, 20:31 IST
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో షాకులపై షాక్‌లు కనిపిస్తున్నాయి. మొత్తం 28 సీట్లలో 25 సీట్లను...
24-05-2019
May 24, 2019, 20:20 IST
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు చేసిన పొరపాట్లు పోటీ చేసిన అభ్యర్ధుల తలరాతలు మార్చేశాయి. కీలక స్థానాల్లో...
24-05-2019
May 24, 2019, 20:16 IST
సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన చంద్రబాబు నాయుడుకి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌ వేదికగా...
24-05-2019
May 24, 2019, 19:30 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసాధారణమైన విజయం సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది....
24-05-2019
May 24, 2019, 19:17 IST
కమల వికాసంతో విపక్షాలు కకావికలం..
24-05-2019
May 24, 2019, 19:02 IST
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో 43 శాతం ఓట్లతో పాలకపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌ 22 లోక్‌సభ స్థానాలను...
24-05-2019
May 24, 2019, 18:33 IST
అందుకే చంద్రబాబు ఓడారు..
24-05-2019
May 24, 2019, 18:05 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చిలుక జోస్యం చెప్పి బొక్కబోర్లాపడ్డ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌... ఇక జీవితంలో...
24-05-2019
May 24, 2019, 17:42 IST
బెంగళూరు : తన కోసం సీటు త్యాగం చేసిన కారణంగా తాతయ్య ఓడిపోయారంటూ మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు, ఎంపీ...
24-05-2019
May 24, 2019, 17:39 IST
ప్రధాని పదవికి మోదీ రాజీనామా
24-05-2019
May 24, 2019, 17:21 IST
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడు అవినీతి పాలనే టీడీపీ ఓటమికి కారణం అయిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు....
24-05-2019
May 24, 2019, 17:00 IST
గవర్నర్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా వైఎస్‌ జగన్‌..
24-05-2019
May 24, 2019, 16:55 IST
సాక్షి, పలాస (శ్రీకాకుళం): టీడీపీ కంచుకోట బద్దలైంది. వారసత్వ రాజకీయాలకు తెరపడింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం తర్వాత అత్యంత రాజకీయ చైతన్యం గల...
24-05-2019
May 24, 2019, 16:43 IST
కాంగ్రెస్‌కు మాజీ క్రికెటర్‌ హితవు..
24-05-2019
May 24, 2019, 16:39 IST
సాక్షి, అవనిగడ్డ: అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ చరిత్ర సృష్టించింది. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యే అయిన సింహాద్రి రమేష్‌బాబు రికార్డు...
24-05-2019
May 24, 2019, 16:32 IST
చెన్నై: హీరో కమల్‌ హాసన్‌ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. తమిళనాడు,...
24-05-2019
May 24, 2019, 16:30 IST
సాక్షి, చిలకలపూడి : బందరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని) ముచ్చటగా మూడోసారి ఘన విజయం...
24-05-2019
May 24, 2019, 16:26 IST
సాక్షి, ఎచ్చెర్ల (శ్రీకాకుళం): ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్ట నష్టాలు చూసిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న ఆధరాభిమానాలు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పార్టీ...
24-05-2019
May 24, 2019, 16:20 IST
మోదీ ప్రభంజనంలో మాజీ ప్రధాని దేవెగౌడ సహా పలువురు మాజీ సీఎంలు మట్టికరిచారు.
24-05-2019
May 24, 2019, 16:18 IST
అనకాపల్లి: టీడీపీ కంచుకోటగా భావించే అనకాపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాగా వేసింది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌ స్థానంలో ఘన...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top