బాబోరూ! పులిగోరు!!

Article On JD Laxmi Narayana And Chandrababu Naidu - Sakshi

జనతంత్రం  

బాలనాగమ్మ అనే జానపద కథ తెలిసిన తరంవారికి ఆ కథలోని బాలవర్ధిరాజు అనే బాలవీరుని పాత్ర, తిప్పడు అనే దురాశ పరు డైన విదూషకుని పాత్ర గుర్తుండే వుంటుంది. బాలనాగమ్మ సౌందర్యానికి వివశుడైన మాయల పకీరు అనే మాంత్రికుడు ఆమెను అపహరించి తన గుహలో బంధిస్తాడు. యుద్ధా నికి వచ్చిన ఆమె భర్త కారంపూడి పాలకుడు కార్యవర్ధిని శిలగా మారుస్తాడు. వారి కుమారు డైన బాలవర్ధిరాజు తల్లిదండ్రులను వెతుక్కుంటూ బయల్దేరు తాడు. దారిలోని అడవి ప్రాంతంలో ఒక పెద్దపులి సంచరిస్తుం టుంది.

పరిసర గ్రామాల ప్రజలు భయంతో ఆ ప్రాంతపు రాజుగారి శరణు వేడుతారు. ఆ పులిని చంపి దాని గోళ్లను ఆనవాళ్లుగా తెచ్చి చూపిన వీరునికి అర్ధ రాజ్యం బహుమతిగా ఇస్తాననీ, తన కుమా ర్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని రాజుగారు చాటింపు వేయించి ఉంటాడు. అడవి మార్గాన వెళుతున్న బాలవర్ధికి పులి ఎదురవుతుంది. ఆ యువకుడు భీకరంగా పోరాడి పులిని హతమారుస్తాడు. అలసి పోయి ఒక చెట్టుకింద నిద్రపోతాడు. దూరంగా ఇదంతా గమని స్తున్న తిప్పడు అనే పొరుగూరి సాధారణ వ్యక్తి మదిలో దురాశ పుడుతుంది. నిశ్శబ్దంగా ఆ పులిగోళ్లను కత్తిరించుకొని రాజాస్థానా నికి చేరుకుంటాడు. ఇలాంటి జానపద కథలన్నింటిలాగే ఈ కథ లోనూ వీరుడెవరో.. విదూషకుడెవరో తెలిసిపోతుంది. ఈ కథతో మన సంబంధం ఇక్కడి వరకే.

ఇప్పుడిక్కడ ప్రస్తావించబోయే ఆధునిక పులిగోటి వీరుడు మాత్రం తనను తాను హీరోగా అభివర్ణించుకుంటారు. ఎవ్వరడి గినా అడక్క పోయినా, సందర్భమైనా అసందర్భమైనా సరే... తన అవక్ర విక్రమ పరాక్రమ వీరత్వాన్ని తన్మయత్వంలో రంగరించి చెప్పుకోవడం ఆయనకు అలవాటు. అది ఎటువంటి బంధమో తెలి యదు కానీ, గంటల తరబడి సాగే ఆయన స్వోత్కర్షను మెజారిటీ చానళ్లు లైవ్‌ టెలికాస్టు చేయాల్సిందే. కొన్ని పత్రికలు రోజూ మోయా ల్సిందే. ఆయన కథానాయకుడా, ప్రతినాయకుడా, విదూషకుడా, విదూషకత్వంతో కూడిన ప్రతినాయకుడా అన్నదానిపై భిన్నాభి ప్రాయాలు ఉన్నాయి. అయితే, పులిగోరు విద్యల్లో ఆయనంత ఆరి తేరిన రాజకీయ నేత మరెవ్వరూ లేరని మాత్రం అందరూ అంగీ కరిస్తారు.

పీవీ నరసింహారావుగారు ప్రధానిగా వున్న సమయంలో ఎంతో దూరదృష్టితో హైదరాబాద్‌ను కంప్యూటర్‌ రంగానికి కేంద్రంగా చేయడానికి పునాదులు వేశారు. ఆ రంగంలో హైదరాబాద్‌ నగరం చేత తొలి అడుగును ఆయనే వేయించారు. తొలి అడుగు వేసిన ఈ నగరం ఐటీలో అగ్రస్థానంలో ఉండాల్సింది. కానీ, కథ ఇక్కడే మలుపు తిరి గింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓడిపోయింది. ఎన్నికల చరిత్రను తిరగరాస్తూ ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చారు. అనతికాలంలోనే, మీడియా రంగాన్ని శాసిస్తున్న గురువులు–లఘువుల సహకారంతో చంద్రబాబు ఓ కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కోటరీ సాయంతో కత్తి వాడకుండానే, నెత్తురు కారకుండానే పూర్తి అహింసా పద్ధతుల్లో ఎన్టీఆర్‌ గుండెకాయను కోసేయడం, అధికారాన్ని హస్తగతం చేసుకోవ డం జరిగిపోయింది.

చంద్రబాబు తొమ్మిదేళ్లు పరిపాలించారు. భారత దేశంలో గుప్తుల స్వర్ణయుగాన్ని తలదన్నే ఆంధ్రుల స్వర్ణయుగంగా ఓ వర్గం వారు ఈ కాలాన్ని పేర్కొంటారు. అందుకు తందానాగా మీడి యాలోని గురువులూ, లఘువులూ దరువులేసి మరీ ప్రచారంలో పెట్టారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో పక్కనున్న కర్ణాటకలో ముగ్గురు ముఖ్య మంత్రులు మారిపోయారు. దేవెగౌడ రెండేళ్లు, హెచ్‌జే పటేల్‌ రెండేళ్లు, ఎస్‌.ఎమ్‌. కృష్ణ ఐదేళ్లు అధికారంలో వున్నారు. అదేం చిత్రమో గాని ఇక్కడ మన స్వర్ణయుగం ముగిసేనాటికి (అక్కడ ముగ్గురు మారిన ప్పటికీ) హైదరాబాద్‌ అందుకోలేనంత దూరం ఐటీ రంగంలో బెంగ ళూరు పరిగెత్తింది. కానీ, సైబర్‌ టవర్స్‌ అనే బిల్డింగ్‌ ఆకారంలో ఓ పులిగోరు చంద్రబాబు మెడలో చేరిపోయింది. భారతదేశంలో ఐటీ రంగానికి ఆద్యుడెవరు? కంప్యూటర్‌ను ప్రవేశపెట్టిందెవరు?... ఇంకె వరు!... భజంత్రీలూ వాయించండర్రా...! వాయించేశారు. గురువులు, లఘువులూ స్తోత్రకైవారాలు గావించారు.

భారతదేశంలో మరే నగరానికీ లేని ప్రత్యేకత హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ఎనిమిది వరుసలలో రూపొందిన ఈ రహదారి మౌలిక వసతుల రంగంలో హైదరాబాద్‌ను అగ్రస్థానానికి చేర్చింది. ఈ రహదారి ప్లానింగూ, భూసేకరణ, నిర్మాణం అంతా వైఎస్‌ హయాంలోనే జరిగింది. అప్పుడు జరిపిన భూసేకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం భజన బృందం పెద్ద దుమారాన్నే లేవ దీసింది. అయినాసరే దీన్ని కూడా ‘స్వర్ణయుగం కోటరీ’ బాబు ఖాతా లోనే వేసింది. బాబు కూడా సిగ్గుపడకుండా, భయపడకుండా తన ఘన తగానే మరో పులిగోరు మెడలో వేసుకున్నారు. వాయిద్యాలూ మోగాయి. స్తోత్ర పఠనం కూడా జరిగింది.

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కథ కూడా ‘షేమ్‌ టు షేమ్‌’. ఆ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన జరిగింది వై.ఎస్‌. హయాంలోనే. ప్రారంభోత్సవం జరిగిందీ ఆయన ఆధ్వర్యంలోనే. అయినా సరే దాని పేరుతో కూడా ఓ పులిగోరు బాబుగారి దగ్గరుంది. విమానాశ్రయాన్ని కట్టింది చంద్రబాబేనంటూ ‘స్వర్ణయుగ’ చరిత్రకారులు రాసి పెట్టారు. ఎల్లో సిండికేట్‌ ఆధ్వర్యంలో యధాశక్తి వాద్యం! యథాశక్తి స్తోత్రం!!
ఇలా చెప్పుకుంటూపోతే ఈ పులిగోళ్ల పురాణం ఓ గ్రంథమవు తుంది. అందుకని, వ్యాస విస్తరణ భీతివల్ల ఇంతటితో ముగించి, తాజా పరిపాలనాకాలం ముగుస్తున్న వేళ ఉన్న పరిస్థితిని పలకరిద్దాం. అధి కారాంతమున ఆయన ఆర్డర్‌ చేసిన పులిగోళ్లు మరీ ముచ్చటగా ఉన్నాయి. ఎన్నికల రణరంగంలో అలంకరించుకునేందుకు బంగారు తొడుగుల పులిగోళ్లను ఆయన సిద్ధం చేశారు. ఐదేళ్ల కింద జరిగిన ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పారు.

ఆయనిచ్చిన డబ్బులు వడ్డీకి కూడా సరిపోలేదని ఓ పక్క రైతులంతా గగ్గోలుపెడుతున్నా ఆయ నకు పట్టలేదు. సరిగ్గా మళ్లీ ఎన్నికలొచ్చేసరికి ‘అన్నదాతా సుఖీభవ’ అంటూ మరో పులిగోరు ఆభరణం తగిలించుకున్నారు. మోడల్‌ కూడా తన తెలివికాదు. రెండేళ్ల కింద ప్రతిపక్ష నేత ప్రకటించిన రైతు భరోసాను లేపేశాడు. అదీ వెంటనే లేపలేదు. ఆయన ఉద్దేశం ఎన్నికల ముందు అలంకరించుకోవడమే కనుక రెండు నెలల ముచ్చటకో సమే ఈ మురిపెం. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎగనామం పెట్టారు. మామూలు మనిషన్నవాడైతే చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాడు. కానీ, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చి, పసుపు– కుంకుమ అనే సెంటిమెంటు పులిగోళ్లను బయటకు తీశాడు. రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్‌–సావిత్రి మధ్య నడిచిన సిస్టర్‌ సెంటిమెంట్‌కు దీటుగా ఈ రెండు నెలలు పసుపు కుంకుమ అనే నాటకాన్ని నడిపించేందుకు తైనాతీలు య«థాశక్తి తాపత్రయపడు తున్నారు. నిరుద్యోగ సమస్యపైనా అదే డ్రామా. ఇంటికో ఉద్యోగం ఇస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మండలానికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి చివరిదాకా ఇవ్వలేదు. రెండు నెలల ఎన్నికల వేషంకోసం ఇప్పుడా పులిగోరు కూడా సిద్ధమైంది.

పూర్వం రాజులు యుద్ధాల్లో గెలిచినప్పుడు విజయసూచ కంగా శిలాశాసనాలను ప్రతిష్ఠించే వాళ్లు. కానీ బాబుగారు ఎక్కడా గెలవకుండానే గెలిచినట్టు ప్రచారం చేసుకునే విద్యలో రాటుదే లారు. బతికి వున్న పులి దగ్గరికే పోకుండా చచ్చిన తర్వాత గోళ్లు ఎత్తుకొచ్చి అమ్ముకునేవాళ్ల మాదిరిగా. వ్యక్తిత్వ వికాస పాఠాల్లోని ఓ ప్రాథమిక సూత్రాన్ని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. అది ‘సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాల’ని! కానీ ఈ సూత్రాన్ని కొంత భిన్నమైన రీతిలో ఆయన ఆచరించారు. వైఫ ల్యాలను కూడా విజయాలుగా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు ఉనికి రహస్యం.

కొసమెరుపు
చివరి పులిగోరు కొంచెం తేడా. ఇంతకుముందు తాను చేయని పనులను చేసినట్టుగా చూపించుకునే పులిగోళ్లు. తాజాగా తాను చేసిన పాపానికి ఒప్పుకోలు పులిగోరు. వై.ఎస్‌. రాజశేఖ రరెడ్డి దురదృష్టకర మరణం తర్వాత ఆయన కుమారుడిని పార్టీ నుంచి బయటకు పంపి తప్పుడు కేసులు పెట్టిన కాంగ్రెస్‌ అధిష్టానంతో చంద్రబాబు స్నేహం ముసుగు జారి బహిరంగమయింది. జగన్‌కు వ్యతి రేకంగా కుట్రలు నడపడంలో తోడ్పడిన కిరణ్‌కుమార్‌రెడ్డిని మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేర్పించింది బాబే. ఆయన తమ్ముడికి అసెంబ్లీ టికెట్‌ కూడా టీడీపీ తరఫునే ఖాయం చేశారు. కిరణ్‌ను కూడా పార్లమెంట్‌ బరిలో నిలపాలనే ముచ్చట కూడా వుందట బాబుకు. కానీ, ఆ వీరుడికి కత్తిపట్టడం చాతనవుద్దో, కాదోనన్న సందేహం పీడిస్తోందట. కాంగ్రెస్‌ పార్టీ సహకారంతో తాను, తన ఎల్లో సిండికేట్‌ రచించి దర్శకత్వం వహించిన జగన్‌ కేసుల నాటకంలో కీలక పాత్ర పోషించిన అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు టీడీపీ టికెట్‌ కేటాయించడానికి సిద్ధపడి కథను చంద్రబాబు క్లైమాక్స్‌కు చేర్చారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ తప్పుడు కేసుల వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందని జేడీ మొర పెట్టుకున్నందువల్లనే పదవీ విరమణ చేయించి రాజకీయ ప్రవేశం చేయించారని లోకం కోడై కూస్తోంది. చంద్రబాబు మెడలో తాజా ముద్దుల పులిగోరు జేడీ లక్ష్మీ నారాయణ.


వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top