వీళ్లు కొంచెం ‘స్మార్ట్’ | They were little 'smart' | Sakshi
Sakshi News home page

వీళ్లు కొంచెం ‘స్మార్ట్’

Oct 26 2014 1:30 AM | Updated on Nov 6 2018 5:26 PM

వీళ్లు కొంచెం ‘స్మార్ట్’ - Sakshi

వీళ్లు కొంచెం ‘స్మార్ట్’

మనిషి అనేక విధాలుగా తన ప్రత్యేకతను చాటుకోవచ్చు. ఒక వస్తువును వాడటం ద్వారా,వాడే తీరును బట్టి కూడా తనెంత ప్రత్యేకమో చాటి చెప్పవచ్చు.

మనిషి అనేక విధాలుగా తన ప్రత్యేకతను చాటుకోవచ్చు. ఒక వస్తువును వాడటం ద్వారా, వాడే తీరును బట్టి కూడా తనెంత ప్రత్యేకమో చాటి చెప్పవచ్చు. అందుబాటులోకి వస్తున్న అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో, దానితో ముడిపడిన జీవనశైలిలో కూడా ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిన సెలబ్రిటీలున్నారు. స్మార్ట్‌ఫోన్‌లను, ఇతర కొత్త కొత్త గాడ్జెట్స్‌ను వారు తమ జీవనశైలిలో భాగం చేసుకున్నారు. అదెలాగంటే...
 
కరీనాకపూర్
వస్తువుల్లో దేన్నో ఒక్కదాన్నే ఎంచుకోవాల్సిన పరిస్థితే వస్తే.. నా ఛాయిస్ ఫోనే అంటుంది బెబో. ఫోన్, దాని ప్రాశస్త్యం గురించి కరీనా ఎంత గొప్పగానైనా చెప్పగలదు. ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్‌తో ఉన్న సౌకర్యాలకు తను బానిసను అంటుందామె. మ్యూజిక్ ప్లేయర్ గా, ఇ-బుక్ రీడర్‌గా, స్నేహితులతో ఇంట్లో వాళ్లతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండటానికి, అంతులేని ఎంటర్‌టైన్‌మెంట్ కోసం స్మార్ట్‌ఫోన్‌కి మించిన మార్గం లేదని.. అందుకే అదంటే తనకు ప్రాణం అని కరీనా అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.
 
షారుక్ ఖాన్
గాడ్జెట్స్ అంటే పడిచావడమే కింగ్ ఖాన్ ప్రత్యేకత. షారూక్ దగ్గర లెక్కకు మించి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంటాయి. పేరున్న కంపెనీలు విడుదల చేసే కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లు కొనడం ఈ హీరోకి హాబీ. ఎప్పుడు ఏ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రాబోతోందనే అంశంపై కచ్చితంగా దృష్టి నిలిపి.. తన స్నేహితులకు కూడా ఆ అప్‌డేట్స్ ఇస్తూ ఉంటాడట షారుక్ ఖాన్.
 
అభిషేక్ బచ్చన్
జూనియర్ బచ్చన్ వెంట ఎల్లవేళలా ఒక ఐ ప్యాడ్ ఉంటుంది. షూటింగ్ స్పాట్‌లలో ఖాళీ సమయంలోనూ, ప్రయాణాలలోనూ ఆ ఐప్యాడ్ అభిషేక్ చేతిలోకి వచ్చేస్తుంది. ఐ ప్యాడ్‌ను పుస్తకాలు చదవడానికి ఉపయోగించడం బచ్చన్ ప్రత్యేకత. ఇంటర్నెట్‌లో లభ్యం అయ్యే, సేవ్‌చేసి ఉంచిన ఇ-బుక్‌లను చదువుతూ అభిషేక్ టైమ్‌ను సద్వినియోగం చేస్తుంటాడు.
 
బిపాశాబసు
ఈ బెంగాళీ భామ అప్లికేషన్స్ స్పెషలిస్ట్. ప్లేస్టోర్‌లోకి కొత్తగా ఏం అప్లికేషన్స్ వచ్చాయి.. వాటిలో ఏది బెస్ట్... అనే విషయాల గురించి బిపాశా అప్ టు డేట్‌గా ఉంటుంది. తన దైనందిన జీవితం స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్స్‌తో ముడివడి ఉంటుందని... అప్లికేషన్లు రొటీన్ వర్క్‌లో వినోదాన్ని మిళితం చేస్తాయని బిపాశా చెబుతుంది.
 
మాధవన్
ఈ స్మైలీ హీరోకి ‘యాపిల్’డివైజ్‌లు అంటే మోజు. ఐఓఎస్ అంటే క్రేజ్. ఎంతగానంటే.. మాధవన్ దగ్గర లేటెస్ట్ మోడల్ ఐ ప్యాడ్, ఐ పోడ్, ఐ టచ్, ఐ ఫోన్... ఈ నాలుగు ఉన్నాయి. ఐ డివైజ్‌లకు సంబంధించి రివ్యూలు అందించగల, ఐ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే సౌలభ్యాల గురించి సుదీర్ఘంగా ఉపన్యసించగల సమర్థుడు మాధవన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement