ఇంట్లోనే సోడా బుడ్డీ | Soda Stream Starter Kit | Sakshi
Sakshi News home page

ఇంట్లోనే సోడా బుడ్డీ

Jul 3 2016 12:56 AM | Updated on Oct 22 2018 8:14 PM

ఇంట్లోనే సోడా బుడ్డీ - Sakshi

ఇంట్లోనే సోడా బుడ్డీ

బిర్యానీకి ది బెస్ట్ కాంబినేషన్ అంటే.. అది కచ్చితంగా సోడానే.. మరి అలాంటి సోడాను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి.

బిర్యానీకి ది బెస్ట్ కాంబినేషన్ అంటే.. అది కచ్చితంగా సోడానే.. మరి అలాంటి సోడాను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. అలాంటి సోడాను ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ ‘సోడాస్ట్రీమ్ స్టార్టర్ కిట్’ ఉండాల్సిందే. ఈ కిట్‌లో సోడామేకర్, కార్బొనేటర్‌తో పాటు ఓ హై క్వాలిటీ ప్లాస్టిక్ బాటిల్ కూడా ఉంటుంది. దీంట్లో మీరు ఏ డ్రింక్ పోసినా అది సోడాగా మారుతుంది. మంచినీరు, నిమ్మరసం, పండ్ల రసాలు... ఇలా వేటినైనా ఇందులో పోస్తే సరి.

దుకాణాల్లో దొరికే కార్బొనేటెడ్ డ్రింక్ అర నిమిషంలో మీ గ్లాసులో ఉంటుంది. ఒక కార్బొనేటర్ అరవై లీటర్ల సోడాను తయారు చేయగలదు. దాని తర్వాత కార్బొనేటర్ మార్చుకుంటే సరిపోతుంది. వీటికి ఎలాంటి ఎలక్ట్రిసిటీ, బ్యాటరీ అవసరం లేదు. బ్యాగులో ఇమిడిపోయేది కాబట్టి ఫ్యామిలీతో పిక్నిక్లకు వెళ్లినప్పుడు వెంట తీసుకెళ్లొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement