పాఠక స్పందన | Readers responses about funday book | Sakshi
Sakshi News home page

పాఠక స్పందన

Apr 12 2015 1:14 AM | Updated on Sep 3 2017 12:10 AM

శ్రీ రమణ గారు హారీపోటర్ని అమ్మాయిగా చేసేశారు. హారీపోటర్ నవలలోని పాత్రే కానీ, నవల రచయిత కాదు.

శ్రీ రమణ గారు హారీపోటర్ని అమ్మాయిగా చేసేశారు. హారీపోటర్ నవలలోని పాత్రే కానీ, నవల రచయిత కాదు. రాసిన విషయం ఎంతబాగున్నా, అసలైన సమాచారం తప్పు కాకూడదు కదా...
- శ్రీకుమార్, ఇ మెయిల్
 
 తేనెమనసులు సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన కథనం చాలా బాగుంది. మమ్మల్ని సంతోషపెట్టింది.
 ఎస్. రమ్య
- ఇ మెయిల్
 
 మార్చి 29వ తేదీ సంచికలో ప్రచురితం అయిన శ్రీకారాలు-శ్రీ మిరియాలూలో ‘మన అమ్మాయే’లో ప్రస్తావించిన హారీపోటర్ ఆ నవల్లోని ప్రధానపాత్ర పేరు. దాని రచయిత జేకే రౌలింగ్. కాబట్టి హారీపోటర్ మన అమ్మాయే అంటే చెల్లదు.
 - రాయపెద్ది అప్పా శేషశాస్త్రి, ఆదోని
 
 మార్చి 29వ తేదీ ఫన్‌డేలో ప్రచురితం అయిన బెస్ట్‌కేస్ ‘ముందే చెప్పి ఉంటే’ చాలా ఆసక్తికరంగా ఉంది. చెడు చేసే వాళ్లకు చెడే జరుగుతుంది అనడానికి ఈ కథే ఒక ఉదాహరణ. అతడు రౌడీలకు ఆశ్రయం ఇచ్చి ఉండకపోతే అతడి పాప బతికి ఉండేది కదా.
 - రాము, హైదరాబాద్.
 
 సూపర్‌స్టార్ కృష్ణ సినీరంగ ప్రవేశం, తేనె మనసులు 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఇచ్చిన కవర్ స్టోరీ ఆసక్తికరంగా చదివింపజేసింది. శ్రీరమణ గారి కారాలు, మిరియాలు చక్కలిగింతలు పెడుతున్నాయి. నానీలు అలరిస్తున్నాయి. ప్రహేళిక భాషపై పట్టుసాధించేందుకు ఉపయోగకరంగా ఉంది.
 - రామచంద్రం, నారాయణపురం
 
 మెడికల్ మెమరీస్‌లో ‘ఆ చిన్నారులు మాట్లాడిన అపురూప వేళల్లో’ చాలా బాగుంది. నేను అమ్మని కాకపోయినా ఆ బాధను అర్థం చేసుకోగలను. వారికి ఉచితంగా చికిత్స చేసిన డాక్టర్ రచన గారిని, వారి తండ్రి వినయ్‌కుమార్‌ని అభినందిం చాలి. ఇలాగే చికిత్స చేయాలని కోరుతూ...
 - వనజ పాలకూరు, ఇ మెయిల్
 
 మీ అభిప్రాయాలనూ, రచనలనూ స్వాగతిస్తున్నాం. మా చిరునామా: ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34.
 ఫోన్: 040-23256000
 funday.sakshi@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement