చెవులను చుట్టేసే అందం!

చెవులను చుట్టేసే అందం!


మేడ్ ఇన్ హోమ్

చక్కని డ్రెస్ వేసుకుంటాం. సమయానికి దానికి తగ్గ చెయిన్ ఉండకపోవచ్చు. ఆ చెయిన్‌కి తగ్గ ఇయర్ రింగ్స్ ఉండకపోవచ్చు. ఉన్నవాటితో అడ్జస్ట్ అవుదామంటే రంగులు మ్యాచ్ కాకపోవచ్చు. దాంతో పార్టీకి వెళ్లాలన్న మూడ్ ఖరాబు కావచ్చు. కానీ మీ దగ్గర క్విల్డ్ పేపర్స్, ఓ తీగ, కాస్త జిగురు ఉంటే చాలు... అప్పటికప్పుడు మీకు కావలసిన జ్యూయెలరీని మీరే తయారు చేసుకోవచ్చు.

 ఇంతకీ క్విల్డ్ పేపర్ అంటే తెలుసు కదా! చుట్లు చుట్లుగా ఉంటుంది.



డెకరేషన్‌లో వాడుతుంటారు. ఇది చాలా రంగుల్లో ఉంటుంది. ఖరీదు తక్కువే కాబట్టి అన్ని రంగులూ తెచ్చి పెట్టుకోండి. రాగి, సిల్వర్ తీగలు కూడా దగ్గర ఉంచుకోండి. ఓ గమ్ బాటిల్ ర్యాక్‌లో పడేయండి. అంతే... ఇక మీరే జ్యూయెలరీ డిజైనర్ అవతారం ఎత్తవచ్చు. మీకు ఏ ఆకారంలో ఇయర్ రింగ్ లేక లాకెట్ కావాలో పేపర్ మీద గీసుకోండి. ఆ ఆకారంలో క్విల్డ్ పేపర్ పీసెస్‌ను పెట్టి అతికించుకుంటే పోండి. తర్వాత దాన్ని రాగి తీగకు అమర్చండి.



ఒక బేస్ కానీ, ఔట్‌లైన్ కానీ కావాలనుకున్నప్పుడు... కాస్త మందంగా ఉండే కాగితాన్ని సన్నగా ఫ్రేమ్‌లా కట్ చేసి, దాని మధ్యలో క్విల్డ్ పేపర్ పీసెస్‌ని అతికించు కోవాలి. గ్రాండ్‌గా కావాలంటే కుందన్స్, చమ్కీల్లాంటివి యాడ్ చేసుకోవచ్చు. డ్రెస్‌ను బట్టి కలర్ కాంబినేషన్స్ ఎంచుకోండి. ఇక్కడున్న కొన్ని మోడల్స్ చూస్తే ఎలా చేయవచ్చో మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీ క్రియేటివిటీకి పని పెట్టండి!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top