హాట్ క్రాస్డ్ బన్ | Hot cross bun of Hair style | Sakshi
Sakshi News home page

హాట్ క్రాస్డ్ బన్

May 29 2016 12:11 AM | Updated on Sep 4 2017 1:08 AM

హాట్ క్రాస్డ్ బన్

హాట్ క్రాస్డ్ బన్

ఈ హెయిర్ స్టయిల్‌ను ‘హాట్ క్రాస్డ్ బన్’ అంటారు. ఇది చీరలకే కాదు గాగ్రాలకు, లంగావోణీలకు భలేగా నప్పుతుంది.

సిగ సింగారం
ఈ హెయిర్ స్టయిల్‌ను ‘హాట్ క్రాస్డ్ బన్’ అంటారు. ఇది చీరలకే కాదు గాగ్రాలకు, లంగావోణీలకు భలేగా నప్పుతుంది.
అసలు వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరూ తమ జుత్తును కొప్పుగా మార్చేసుకుంటారు.
అది సాధారణ విషయమే. కానీ ఆ కొప్పుల్లోనూ వెరైటీ ఉండాలి కదా.
అందుకే మామూలు కొప్పుకు బదులుగా ఓసారి ఈ టైప్ ఆఫ్ కొప్పును ట్రై చేయండి.

 
1. ముందుగా జుత్తును నున్నగా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. ఆపైన జుత్తును ఫొటోలో కనిపిస్తున్న విధంగా మూడు భాగాలుగా చేసుకోవాలి. (ముందువైపు మధ్యపాపిట తీసుకోవాలి)
 
2. ఇప్పుడు మధ్య భాగంలోని జుత్తుకు ఓ రబ్బర్‌బ్యాండ్‌తో టై చేసుకోవాలి.
 
3. పైన బ్యాండ్ పెట్టిన పోనీని చిక్కులు లేకుండా దువ్వుకోవాలి.
 
4. ఆ పోనీని ఇప్పుడు కొప్పుగా చుట్టుకోవాలి. మిగిలిన పోనీ చివర జుత్తును బయటికి కనిపించకుండా కొప్పు లోపలకి పెట్టి స్లైడ్ పెట్టేయాలి. (కొప్పు బన్‌లా గుండ్రంగా వచ్చేలా చూసుకోవాలి)
 
5. తర్వాత ఎడమ చెవి వైపున్న జుత్తును ఓసారి దువ్వుకొని, మూడు పాయలు తీసుకోవాలి. జడ కాస్త అల్లిన తర్వాత ఎడమ పక్క నుంచి ఒక్కో పాయను తీసుకుంటూ ఈ జడలో కలుపుకుంటూ పోవాలి.(జడను ఇన్‌సైడ్ అవుట్ (రివర్స్) అల్లుకుంటూ పోవాలి)
 
6. జడను పూర్తిగా అల్లకుండా, చివర కొద్దిగా జుత్తును వదిలి బ్యాండు పెట్టేయాలి.
 
7. ఇప్పుడు కుడి చెవి వైపున్న జుత్తును కూడా మిగతా వైపు జుత్తులాగే అల్లి బ్యాండు పెట్టేయాలి.
 
8. ఎడమ చెవి వైపు అల్లుకున్న జడ మరీ టైట్‌గా లేకుండా, ఒక్కో పాయను కదిలిస్తూ వదులు చేసుకోవాలి. రెండోవైపు జడను కూడా అలాగే వదులు చేసుకోవాలి.       
 
9. తర్వాత రెండువైపుల ఉన్న జడలను అటుది ఇటు, ఇటుది అటు తీసుకు రావాలి.
 
10. ఇప్పుడు ఆ రెండు జడల పోనీల చివర్లను చిక్కులు లేకుండా దువ్వుకోవాలి.
 
11. ఆ రెండింటినీ కొప్పు చుట్టూ చుట్టేయాలి. చివర్లు కనిపించకుండా, కొప్పు వదులుకాకండా కావలసిన చోట స్లైడ్స్ పెట్టేయాలి.
 
చివరికి ఏదైనా ఫ్లవర్‌ని కొప్పుకు అలంకరిస్తే... ఎంతో అందమైన ‘హాట్ క్రాస్డ్ బన్’ హెయిర్ స్టయిల్ ఫొటోలో కనిపిస్తున్నట్లుగా తయారవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement