ట్యాప్ తిప్పితే కూల్‌డ్రింక్ వస్తుంది! | Cool drink tap twisting comes! | Sakshi
Sakshi News home page

ట్యాప్ తిప్పితే కూల్‌డ్రింక్ వస్తుంది!

Apr 9 2016 11:03 PM | Updated on Sep 3 2017 9:33 PM

ట్యాప్ తిప్పితే కూల్‌డ్రింక్ వస్తుంది!

ట్యాప్ తిప్పితే కూల్‌డ్రింక్ వస్తుంది!

వేసవిలో ఫ్రిజ్‌లో కూరగాయలు ఉన్నా, లేకున్నా సాఫ్ట్ డ్రింక్స్ మాత్రం తప్పకుండా ఉంటాయి.

వేసవిలో ఫ్రిజ్‌లో కూరగాయలు ఉన్నా, లేకున్నా సాఫ్ట్ డ్రింక్స్ మాత్రం తప్పకుండా ఉంటాయి.  మామూలుగా అయితే బాటిల్‌ను బయటకు తీసి, డ్రింక్ గ్లాసులో పోసుకొని, మళ్లీ బాటిల్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటాం. అయితే అందరూ కూర్చుని సరదాగా తింటున్నప్పుడే వస్తుంది సమస్య. బాటిల్ బయట ఉంచితే కూలింగ్ పోతుంది. అలా అని ప్రతిసారీ డ్రింకు పోసుకుంటూ ఉండటం కష్టం. చిన్నపిల్లలయితే బాటిల్‌ను తీసి గ్లాసుల్లో పోసుకునే క్రమంలో కింద పారబోస్తుంటారు కూడా.

ఇవేవీ జరగకుండా ఉండాలంటే ‘సాఫ్ట్‌డ్రింక్ డిస్పెన్సర్’ ఉండాల్సిందే. డ్రింక్ బాటిల్ మూత తీసి, దాన్ని ఈ డిస్పెన్సర్‌పై తలకిందులుగా పెట్టి ట్యాప్ తిప్పితే చక్కగా డ్రింక్ గ్లాసుల్లో పడుతుంది. ఇంట్లో పార్టీలు, ఫంక్షన్లు జరిగినప్పుడు ఇది బాగా ఉపయోగపడు తుంది. ధర ఆన్‌లైన్‌లో రూ.130-250 వరకు ఉంది. షాపుల్లో అయితే మరో రూ.20-30 అదనంగా ఉండొచ్చు. వేరే మోడల్స్ రేటు ఇంకాస్త ఎక్కువే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement