breaking news
Soft drink dispenser
-
రూ.9,000 కోట్ల నిధుల సమీకరణ
పానీయాల తయారీ కంపెనీ పెప్సీకోకు బాటిళ్లు సమకూర్చడంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న వరుణ్ బెవరేజెస్, ఫోర్టీస్ హెల్త్‌కేర్ తాజాగా నిధుల సమీకరణ బాట పట్టాయి. వ్యాపార వృద్ధి, కొత్త ప్రొడక్టులు, కొత్త ప్రాంతాలకు విస్తరణ, ఇతర సంస్థల కొనుగోళ్లు, రుణాల చెల్లింపునకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతాయని సంస్థలు తెలిపాయి.వరుణ్ బెవరేజెస్ రూ.7,500 కోట్లుఅర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా నిధులు సమీకరించే ప్రతిపాదనకు వరుణ్ బెవరేజెస్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వృద్ధి ప్రణాళికల అమలుకు వీలుగా క్విప్ ద్వారా రూ.7,500 కోట్లు మించకుండా సమకూర్చుకునేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా నిధులు సమీకరించే అవకాశం ఉందని తెలియజేసింది. అయితే ఇందుకు పోస్టల్ బ్యాలట్ ద్వారా వాటాదారుల అనుమతులు సైతం కోరనున్నట్లు పేర్కొంది. క్విప్‌లో కనీసం 10 శాతాన్ని మ్యూచువల్ ఫండ్స్‌కు కేటాయించనుంది. నిధులను అనుబంధ, భాగస్వామ్య లేదా సహచర సంస్థలలో పెట్టుబడులకు వెచ్చించనున్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: ‘స్మార్ట్’ ఉన్నా ఫీచర్ ఫోన్లను ఎందుకు కొంటున్నారు?ఫోర్టిస్ హెల్త్‌కేర్ రూ.1,500 కోట్లుఎన్సీడీలు(నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్-కంపెనీ అప్పు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే దాని ఆస్తులు అమ్ముకోవచ్చు) జారీ ద్వారా నిధులు సమీకరించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఫోర్టిస్ హెల్త్‌కేర్ వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో అర్హతగల ఇన్వెస్టర్లకు ఎన్సీడీల జారీ ద్వారా రూ.1,500 కోట్లవరకూ సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. ఇన్వెస్టర్ల జాబితాలో డీబీఎస్ బ్యాంక్(డీబీఎస్), హెచ్ఎస్బీసీ, సిటీకార్ప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(సింగపూర్), మిజుహో బ్యాంక్ సింగపూర్సహా ఇతర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లున్నట్లు వివరించింది. ఐదేళ్ల కాలపరిమితితో ఎన్సీడీలను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. -
ట్యాప్ తిప్పితే కూల్‌డ్రింక్ వస్తుంది!
వేసవిలో ఫ్రిజ్‌లో కూరగాయలు ఉన్నా, లేకున్నా సాఫ్ట్ డ్రింక్స్ మాత్రం తప్పకుండా ఉంటాయి. మామూలుగా అయితే బాటిల్‌ను బయటకు తీసి, డ్రింక్ గ్లాసులో పోసుకొని, మళ్లీ బాటిల్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటాం. అయితే అందరూ కూర్చుని సరదాగా తింటున్నప్పుడే వస్తుంది సమస్య. బాటిల్ బయట ఉంచితే కూలింగ్ పోతుంది. అలా అని ప్రతిసారీ డ్రింకు పోసుకుంటూ ఉండటం కష్టం. చిన్నపిల్లలయితే బాటిల్‌ను తీసి గ్లాసుల్లో పోసుకునే క్రమంలో కింద పారబోస్తుంటారు కూడా. ఇవేవీ జరగకుండా ఉండాలంటే ‘సాఫ్ట్‌డ్రింక్ డిస్పెన్సర్’ ఉండాల్సిందే. డ్రింక్ బాటిల్ మూత తీసి, దాన్ని ఈ డిస్పెన్సర్‌పై తలకిందులుగా పెట్టి ట్యాప్ తిప్పితే చక్కగా డ్రింక్ గ్లాసుల్లో పడుతుంది. ఇంట్లో పార్టీలు, ఫంక్షన్లు జరిగినప్పుడు ఇది బాగా ఉపయోగపడు తుంది. ధర ఆన్లైన్లో రూ.130-250 వరకు ఉంది. షాపుల్లో అయితే మరో రూ.20-30 అదనంగా ఉండొచ్చు. వేరే మోడల్స్ రేటు ఇంకాస్త ఎక్కువే!