క్యాన్సర్‌ను ఇట్టే పట్టేస్తుంది..

Scientists one step closer to a 'Holy Grail' blood test - Sakshi

లండన్‌ : క్యాన్సర్‌ చికిత్స, నియంత్రణలో ముందడుగు పడింది. కేవలం ఒకే పరీక్షతో ఎనిమిది రకాల క్యాన్సర్లను గుర్తించే పద్ధతిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పలు ప్రాణాంతక క్యాన్సర్లను హోలీ గ్రెయిల్‌గా పిలిచే పరీక్షతో ముందుగానే పసిగట్టవచ్చు.ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ పరీక్షను సాధారణ వైద్యులు కూడా సులభంగా చేయడంతో పాటు ఎలాంటి లక్షణాలు కనపడని దశలోనూ క్యాన్సర్లను గుర్తించవచ్చని భావిస్తున్నారు.

ఈ పరీక్ష అందుబాటులోకి వస్తే వ్యాధిని త్వరగా గుర్తించే వీలుండటంతో క్యాన్సర్‌ రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంది. ఈ పరీక్ష అత్యంత సామర్థ్యం కలిగినదని దీన్ని అభివృద్ధి చేసిన బృందానికి నేతృత్వం వహించిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌కు చెందిన డాక్టర్‌ గెట్‌ అటార్డ్‌ చెప్పారు. స్కానింగ్‌లు, కొలనోస్కోపీ వంటి పద్ధతుల అవసరం లేకుండా హోలీ గ్రెయిల్‌గా పిలిచే రక్త పరీక్షతో క్యాన్సర్‌ను గుర్తించవచ్చని ఆయన తెలిపారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top