తెల్లవారుజాము శృంగారం.. ఒంటికి మంచిది! | Morning sex makes for a healthy start! | Sakshi
Sakshi News home page

తెల్లవారుజాము శృంగారం.. ఒంటికి మంచిది!

Aug 29 2014 1:57 PM | Updated on Sep 2 2017 12:38 PM

తెల్లవారుజాము శృంగారం.. ఒంటికి మంచిది!

తెల్లవారుజాము శృంగారం.. ఒంటికి మంచిది!

తెల్లవారుజామునే లేచిన తర్వాత జాగింగ్కు వెళ్లడమో లేదా పార్కులో వాకింగ్ చేయడం మాత్రమే చేస్తున్నారా.. అయితే ఆగండి. తెల్లవారుజామునే శృంగారంలో పాల్గొంటే ఆరోజంతా మీకు చాలా బాగుంటుందట.

తెల్లవారుజామునే లేచిన తర్వాత జాగింగ్కు వెళ్లడమో లేదా పార్కులో వాకింగ్ చేయడం మాత్రమే చేస్తున్నారా.. అయితే ఆగండి. తెల్లవారుజామునే శృంగారంలో పాల్గొంటే ఆరోజంతా మీకు చాలా బాగుంటుందట. శరీరంతో పాటు మనసు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

తెల్లవారుజాము శృంగారం వల్ల ఆరోగ్యం, ఆనందం రెండూ లభిస్తాయని, దానివల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని డెబ్బీ హెర్బెనిక్ అనే సెక్సువల్ హెల్త్ వైద్యుడు తెలిపారు. దానివల్ల వచ్చే ఉత్తేజాన్ని, ముఖంలో వచ్చే మెరుపును ఇతరులు కూడా గుర్తించగలరని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈస్ట్రోజన్ స్థాయి పెరుగుతుందని, దానివల్ల చర్మం, జుట్టు కూడా బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయని ఆయన చెప్పారు. ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ పెరగడం వల్ల వయసుతో పాటు వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయట.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

పోల్

Advertisement