breaking news
glow for skin
-
పచ్చిపాలతో ఇలా చేస్తే ముఖానికి సహజ సిద్ధ నిగారింపు
పచ్చిపాలు, రోజ్ వాటర్‌ను సమానంగా తీసుకుని చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మర్దనా చేయాలి. పదినిమిషాల తరువాత కాటన్ బాల్‌తో తుడిచేయాలి. పచ్చిపాలలో చిటికెడు ఉప్పు వేసి కలపాలి. ఈ పాలను ముఖానికి రాసి ఐదు నిమిషాలపాటు మర్దన చేసి చల్లటి నీటితో కడిగేయాలి. ఎండవేడికి పాడైన చర్మాన్ని సంరక్షించడంలో పచ్చిపాలు ప్రముఖపాత్ర పోషిస్తాయి. రోజూ క్రమం తప్పకుండా రెండుపూటలా పై రెండింటిలో ఏదైనా ఒక పద్దతిని అనుసరిస్తే ముఖానికి సహజ సిద్ధ నిగారింపు సంతరించుకుంటుంది. -
తెల్లవారుజాము శృంగారం.. ఒంటికి మంచిది!
తెల్లవారుజామునే లేచిన తర్వాత జాగింగ్‌కు వెళ్లడమో లేదా పార్కులో వాకింగ్ చేయడం మాత్రమే చేస్తున్నారా.. అయితే ఆగండి. తెల్లవారుజామునే శృంగారంలో పాల్గొంటే ఆరోజంతా మీకు చాలా బాగుంటుందట. శరీరంతో పాటు మనసు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. తెల్లవారుజాము శృంగారం వల్ల ఆరోగ్యం, ఆనందం రెండూ లభిస్తాయని, దానివల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని డెబ్బీ హెర్బెనిక్ అనే సెక్సువల్ హెల్త్ వైద్యుడు తెలిపారు. దానివల్ల వచ్చే ఉత్తేజాన్ని, ముఖంలో వచ్చే మెరుపును ఇతరులు కూడా గుర్తించగలరని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈస్ట్రోజన్ స్థాయి పెరుగుతుందని, దానివల్ల చర్మం, జుట్టు కూడా బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయని ఆయన చెప్పారు. ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ పెరగడం వల్ల వయసుతో పాటు వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయట. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)