ఐటీ బోనం | IT bonus | Sakshi
Sakshi News home page

ఐటీ బోనం

Feb 2 2015 12:01 AM | Updated on Sep 2 2017 8:38 PM

ఐటీ బోనం

ఐటీ బోనం

వాళ్లంతా ఐటీ ఉద్యోగులు. కంపెనీ వార్షికోత్సవంలో సందడే కాదు..

వాళ్లంతా ఐటీ ఉద్యోగులు. కంపెనీ వార్షికోత్సవంలో సందడే కాదు.. సంప్రదాయం ప్రతిబింబించాలని భావించారు. అందుకే భాగ్యనగరంలో వైభవంగా జరిపే బోనాల పండుగను ఉద్యోగులంతా కలసి చేసుకున్నారు. మహిళా ఉద్యోగినులు బోనమెత్తారు. అమ్మోరు భక్తిగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.

మరికొందరు పోతరాజు వేషాల్లో ఇరగదీశారు. మరో ఉద్యోగిని మౌనప్రియ భవిష్యవాణి వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇలా షేక్‌పేట్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం డీఎస్టీ ఇండియా ఇన్వెస్ట్స్ వార్షికోత్సవం తెలంగాణ సంప్రదాయానికి, హైదరాబాద్ అస్తిత్వానికి వేదికగా మారింది. వేడుకలో భాగంగా గాయకుడు అంజూ గుర్వారా సంగీత విభావరి అందరినీ అలరించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement