మిస్ ఇండియాతో డేటింగ్ చేయాలనుందా? | Enjoy date with Mr. and Miss India | Sakshi
Sakshi News home page

మిస్ ఇండియాతో డేటింగ్ చేయాలనుందా?

Jan 9 2015 4:24 PM | Updated on Sep 2 2017 7:27 PM

మిస్ ఇండియాతో డేటింగ్ చేయాలనుందా?

మిస్ ఇండియాతో డేటింగ్ చేయాలనుందా?

మాజీ మిస్ ఇండియా వన్యా మిశ్రాతో గానీ.. మిస్టర్ ఇండియా ప్రతీక్ జైన్తో గానీ డేటింగ్ చేయాలనుందా? అయితే వెంటనే 'వీ' అనే డేటింగ్ యాప్ నిర్వహిస్తున్న పోటీలో పాల్గొనండి.

మాజీ మిస్ ఇండియా వన్యా మిశ్రాతో గానీ.. మిస్టర్ ఇండియా ప్రతీక్ జైన్తో గానీ డేటింగ్ చేయాలనుందా? అయితే వెంటనే 'వీ' అనే డేటింగ్ యాప్ నిర్వహిస్తున్న పోటీలో పాల్గొనండి. అందులో మీరు విజేతలు అయితే.. ప్రతీక్ జైన్తో గానీ, వన్యా మిశ్రాతోగానీ కాఫీ డేట్కు వెళ్లే అవకాశం మీకు వస్తుంది. అందుకు చేయాల్సిందల్లా.. ముందుగా వీ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని, వాళ్ల ప్రొఫైళ్లను లైక్ చేయాలి. అప్పుడు ఆ విషయం ప్రతీక్, వన్యలకు వెళ్తుంది. అలా తమ ప్రొఫైల్స్ను లైక్ చేసిన వాళ్లలోంచి ఐదుగురు అబ్బాయిలు, అమ్మాయిలను వాళ్లు ఎంపిక చేస్తారు. వాళ్లతో కలిసి కాఫీ తాగేందుకు బయటకు వస్తారు.

మంచి ప్రొఫైల్ పిక్చర్, సరైన వ్యక్తిగత వివరాలు ఇవ్వడం ద్వారా యూజర్లు తాము ఎంపికయ్యే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. అలాగే.. యూజర్లు ఎప్పుడూ ఈ యాప్లో యాక్టివ్గా ఉండాలి. అంటే కొన్ని ప్రొఫైళ్లు చూడటం, వాటిని లైక్ చేయడం లాంటివి చేస్తుండాలి. ఐదుగురు అమ్మాయిలు ప్రతీక్ జైన్తోను, ఐదుగురు అబ్బాయిలు వన్యా మిశ్రాతోను కలిసి కాఫీకి వెళ్లే అవకాశం వస్తుంది. భారతీయ యువత తమకు తోడును వెతుక్కునే తీరును మార్చాలని తాము అనుకుంటున్నామని, అందుకే.. యువత కలలు నెరవేర్చేందుకు ఇలాంటి పోటీలు పెడుతున్నామని గెట్ వీ సంస్థ వ్యవస్థాపకులు నితిన్ గుప్తా తెలిపారు. ఈనెల 23వ తేదీ వరకు పోటీ కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement