breaking news
Vanya Mishra
-
మిస్ ఇండియాతో డేటింగ్ చేయాలనుందా?
మాజీ మిస్ ఇండియా వన్యా మిశ్రాతో గానీ.. మిస్టర్ ఇండియా ప్రతీక్ జైన్‌తో గానీ డేటింగ్ చేయాలనుందా? అయితే వెంటనే 'వీ' అనే డేటింగ్ యాప్ నిర్వహిస్తున్న పోటీలో పాల్గొనండి. అందులో మీరు విజేతలు అయితే.. ప్రతీక్ జైన్‌తో గానీ, వన్యా మిశ్రాతోగానీ కాఫీ డేట్‌కు వెళ్లే అవకాశం మీకు వస్తుంది. అందుకు చేయాల్సిందల్లా.. ముందుగా వీ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, వాళ్ల ప్రొఫైళ్లను లైక్ చేయాలి. అప్పుడు ఆ విషయం ప్రతీక్, వన్యలకు వెళ్తుంది. అలా తమ ప్రొఫైల్స్‌ను లైక్ చేసిన వాళ్లలోంచి ఐదుగురు అబ్బాయిలు, అమ్మాయిలను వాళ్లు ఎంపిక చేస్తారు. వాళ్లతో కలిసి కాఫీ తాగేందుకు బయటకు వస్తారు. మంచి ప్రొఫైల్ పిక్చర్, సరైన వ్యక్తిగత వివరాలు ఇవ్వడం ద్వారా యూజర్లు తాము ఎంపికయ్యే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. అలాగే.. యూజర్లు ఎప్పుడూ ఈ యాప్‌లో యాక్టివ్‌గా ఉండాలి. అంటే కొన్ని ప్రొఫైళ్లు చూడటం, వాటిని లైక్ చేయడం లాంటివి చేస్తుండాలి. ఐదుగురు అమ్మాయిలు ప్రతీక్ జైన్తోను, ఐదుగురు అబ్బాయిలు వన్యా మిశ్రాతోను కలిసి కాఫీకి వెళ్లే అవకాశం వస్తుంది. భారతీయ యువత తమకు తోడును వెతుక్కునే తీరును మార్చాలని తాము అనుకుంటున్నామని, అందుకే.. యువత కలలు నెరవేర్చేందుకు ఇలాంటి పోటీలు పెడుతున్నామని గెట్ వీ సంస్థ వ్యవస్థాపకులు నితిన్ గుప్తా తెలిపారు. ఈనెల 23వ తేదీ వరకు పోటీ కొనసాగుతుంది. -
దక్షిణాది చిత్ర పరిశ్రమకు మరో మాజీ మిస్ ఇండియా!
దక్షిణాది చిత్ర పరిశ్రమకు మరో మిస్ ఇండియా పరిచయం కాబోతున్నది. తమిళంలో సత్య, భాషా, అన్నామలై, తెలుగులో ప్రేమ, మాస్టర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సురేశ్ కృష్ణ మాజీ మిస్ ఇండియా వన్య మిశ్రాను దక్షిణాది పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. మా ప్రాజెక్ట్ కోసం వన్య మిశ్రాను ఎంపిక చేశాం. ఇటీవల ఫోటో షూట్ జరిగింది. తాను స్వంత బ్యానర్ లో నిర్మించే చిత్రంలోని పాత్రకు ఖచ్చితంగా సరిపోయే ఎనర్జీ, టాలెంట్ వన్యలో ఉన్నాయని సురేశ్ కృష్ణ తెలిపారు. ద్విభాషా చిత్రంగా రూపొందే ఈ చిత్రంలో ప్రిన్స్ సెసిల్ కథానాయకుడిగా కనిపించనున్నారు.