breaking news
prateek jain
-
'దీపికా పదుకునే అంటే ఇష్టం'
ముంబై: సల్మాన్ ఖాన్ అంటే తనకెంతో ఇష్టమని ఫిట్నెస్ లెజెండ్, మాజీ మిస్టర్ ఇండియా ప్రతీక్ జైన్ తెలిపాడు. చిన్నప్పటి నుంచి అతడిలా ఉండాలని తాపత్రయపడే వాడినని వెల్లడించాడు. సల్మాన్ ఖాన్ ను ఆరాధిస్తూ పెరిగానని 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. మార్షల్ ఆర్ట్స్ పై చిన్నతనం నుంచే మక్కువ పెంచుకున్నానని అన్నాడు. ఫీమేల్ సెలబ్రిటీల్లో దీపికా పదుకునే, మెగాన్ ఫ్యాక్స్ తనకు ఇష్టమని తెలిపాడు. కఠినమైన డైట్ ఫాలో కావడం లేదని, సరైన తిండి మాత్రమే తింటానన్నాడు. మనం ఏం తింటున్నామనే దానిపైనే ఎక్కువగా దేహ దారుఢ్యం ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తానని, తన దేహమే దేవాలయమని పేర్కొన్నాడు. తన బాడీ షేప్ మారడానికి ఎన్నో ఏళ్లు, రోజులు, రాత్రులు కష్టపడ్డానని చెప్పాడు. రోజుకు ఒక గంట కేటాయిస్తే ఎవరైనా మంచి ఫిజిక్ సాధించగలరని అన్నాడు. -
మిస్ ఇండియాతో డేటింగ్ చేయాలనుందా?
మాజీ మిస్ ఇండియా వన్యా మిశ్రాతో గానీ.. మిస్టర్ ఇండియా ప్రతీక్ జైన్‌తో గానీ డేటింగ్ చేయాలనుందా? అయితే వెంటనే 'వీ' అనే డేటింగ్ యాప్ నిర్వహిస్తున్న పోటీలో పాల్గొనండి. అందులో మీరు విజేతలు అయితే.. ప్రతీక్ జైన్‌తో గానీ, వన్యా మిశ్రాతోగానీ కాఫీ డేట్‌కు వెళ్లే అవకాశం మీకు వస్తుంది. అందుకు చేయాల్సిందల్లా.. ముందుగా వీ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, వాళ్ల ప్రొఫైళ్లను లైక్ చేయాలి. అప్పుడు ఆ విషయం ప్రతీక్, వన్యలకు వెళ్తుంది. అలా తమ ప్రొఫైల్స్‌ను లైక్ చేసిన వాళ్లలోంచి ఐదుగురు అబ్బాయిలు, అమ్మాయిలను వాళ్లు ఎంపిక చేస్తారు. వాళ్లతో కలిసి కాఫీ తాగేందుకు బయటకు వస్తారు. మంచి ప్రొఫైల్ పిక్చర్, సరైన వ్యక్తిగత వివరాలు ఇవ్వడం ద్వారా యూజర్లు తాము ఎంపికయ్యే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. అలాగే.. యూజర్లు ఎప్పుడూ ఈ యాప్‌లో యాక్టివ్‌గా ఉండాలి. అంటే కొన్ని ప్రొఫైళ్లు చూడటం, వాటిని లైక్ చేయడం లాంటివి చేస్తుండాలి. ఐదుగురు అమ్మాయిలు ప్రతీక్ జైన్తోను, ఐదుగురు అబ్బాయిలు వన్యా మిశ్రాతోను కలిసి కాఫీకి వెళ్లే అవకాశం వస్తుంది. భారతీయ యువత తమకు తోడును వెతుక్కునే తీరును మార్చాలని తాము అనుకుంటున్నామని, అందుకే.. యువత కలలు నెరవేర్చేందుకు ఇలాంటి పోటీలు పెడుతున్నామని గెట్ వీ సంస్థ వ్యవస్థాపకులు నితిన్ గుప్తా తెలిపారు. ఈనెల 23వ తేదీ వరకు పోటీ కొనసాగుతుంది.