ఈఫిల్‌పై సిటీ బ్యూటీ | City beauty Silpa redy shows Excellent collections over J-Autumn Fashion Show | Sakshi
Sakshi News home page

ఈఫిల్‌పై సిటీ బ్యూటీ

Nov 2 2014 3:59 AM | Updated on Sep 2 2017 3:43 PM

ఈఫిల్‌పై సిటీ బ్యూటీ

ఈఫిల్‌పై సిటీ బ్యూటీ

ప్రపంచపు వింతపై సిటీ డిజైన్లు ప్రకాశించాయి. ఫ్యాషన్ హెవెన్‌లో హైదరాబాద్ హ్యాట్సాఫ్ అనిపించుకుంది.

ప్రపంచపు వింతపై సిటీ డిజైన్లు ప్రకాశించాయి. ఫ్యాషన్ హెవెన్‌లో హైదరాబాద్ హ్యాట్సాఫ్ అనిపించుకుంది. గత నెల 31 అర్ధరాత్రి ఈఫిల్ టవర్ ఫస్ట్ డెక్‌పై నిర్వహించిన జె-ఆటమ్ ఫ్యాషన్ షోలో నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి అద్భుతమైన కలెక్షన్లను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

అటు డిజైనర్‌గా, ఇటు మోడల్‌గానూ టవర్‌పై పవర్ చాటిన శిల్ప... ఈ ఘనత సాధించిన తొలి సౌతిండియన్ డిజైనర్‌గా నిలిచారు. స్థానిక మల్కా బ్రాండ్ ఫ్యాబ్రిక్‌ను వినియోగించి ఆమె ఆవిష్కరించిన ఆటమ్/వింటర్ కలెక్షన్ 2014... ఆహూతులను ఆకట్టుకుంది. ‘ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్’ అని శిల్ప ‘సిటీ ప్లస్’తో తన ఆనందాన్ని పంచుకున్నారు.

 - ఎస్.సత్యబాబు

Advertisement
 
Advertisement
Advertisement