ఒకే ఒక్క సిట్టింగ్‌లో మీ శరీరాకృతి మార్చుకోండి! | can change body shape with on setting | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్క సిట్టింగ్‌లో మీ శరీరాకృతి మార్చుకోండి!

Jan 31 2015 11:18 PM | Updated on Sep 2 2017 8:35 PM

ఒకే ఒక్క సిట్టింగ్‌లో మీ శరీరాకృతి మార్చుకోండి!

ఒకే ఒక్క సిట్టింగ్‌లో మీ శరీరాకృతి మార్చుకోండి!

అధిక బరువు తగ్గించుకోవడం, ఒంట్లో కొవ్వును తగ్గించుకోవడం రెండూ ఒకటే అనే అపోహ చాలా మందిలో ఉంది.

అధిక బరువు తగ్గించుకోవడం, ఒంట్లో కొవ్వును తగ్గించుకోవడం రెండూ ఒకటే అనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇది నిజం కాదు. బరువు తగ్గినప్పుడు మన శరీరంలో ఉన్న కొవ్వు కణాలు చిన్నవిగా మారతాయి. కానీ కణాల సంఖ్యమాత్రం అలాగే ఉంటుంది. మళ్లీ బరువు పెరగగానే ఆ కొవ్వు కణాలు తిరిగి పెద్దవైపోతాయి.
 
 క్రయోలైపాలసిస్... సర్జరీ లేకుండానే కొవ్వు తగ్గించే చికిత్స. ఎఫ్‌డిఎ ఆమోదం కూడా పొందింది. ఆహారంలో జాగ్రత్తలు, వ్యాయామం చేయడం ద్వారా పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. క్రైలిపాలిసిస్ ఒంట్లోని కొవ్వు కణాలను తగ్గిస్తుంది. చర్మంపై ఎలాంటి ప్రభావం చూపని ఈ ప్రక్రియ వల్ల శరీరంలో ఉన్న అనవసరపు కొవ్వు తక్కువ సమయంలోనే పోతుంది.
 
 చక్కటి శరీరాకృతి కోసం..
 ఈ విధానం వల్ల శరీరంలోని అనేక భాగాల్లో కొవ్వును తగ్గించవచ్చు. కేవలం మీకోసమే నిర్దేశించిన విధానంలో మీకు చికిత్స ఉంటుంది. కొన్ని వారాలు లేదా నెలల్లోనే చాలా సహజమైన పద్ధతుల్లో మీ శరీరంలోని కొవ్వు కణాలు తొలగించబడతాయి.
 
 ఇది పూర్తిగా నాన్ సర్జికల్

 సర్జరీ అవసరం లేదు. చికిత్స అనంతరం వెంటనే మీరు మీ పనుల్లోకి వెళ్లొచ్చు. శరీరంలో అనవసరమైన కొవ్వు ఉన్నవారికోసమే ప్రత్యేకంగా రూపొందించిన పద్ధతి ఇది. ఊబకాయంతో బాధపడేవారికి బరువు తగ్గించే ప్రక్రియ కాదు... ఇది లైపోసెక్షన్‌కు ప్రత్యామ్నాయం.
 
 ఖర్చు ఎంత?
 మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, మీకు అవసరమైన సెషన్లు, మీ లక్ష్యం ఏంటి అనేదానిపై ఆధారపడి ధర ఉంటుంది. మీ బడ్జెట్‌లో, మీ లక్ష్యాలకు అనుగుణంగా మీ కోసమే తయారు చేసిన చికిత్సా విధానం ఇది.
 
 చికిత్స సమయం
 ఆ చికిత్సా విధానాన్ని రూపొందించడంలో మీ క్రైలిపాలిసిస్ ఫిజీషియన్ మీకు సాయం చేస్తాడు. మీరు ఎక్కడెక్కడ కొవ్వు తగ్గించుకోవాలనుకుంటున్నారనే దానిపై మీ సెషన్ సమయం ఆధారపడి ఉంటుంది. మీకు అదన పు సెషన్స్‌ను మీ ఫిజీషియన్‌తో కలిసి నిర్ణయించుకోవచ్చు.
 
 ఇది ఎంతవరకు సురక్షితం
 శస్త్రచికిత్స అవసరం లేని కొవ్వు తగ్గించే ప్రక్రియగా క్రైలిపాలిసిస్ సురక్షితమైనది. ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ ప్రజలు ఈ చికిత్స ద్వారా తాము అనుకున్నది సాధించగలిగారు.
 
 నో సైడ్ ఎఫెక్ట్స్
 చికిత్స సమయంలో లాగుతున్నట్టుగా. పట్టేసినట్టుగా, గిల్లినట్టుగా లేదా అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఇది తాత్కాలికమే.
 
 ఫలితం
 చికిత్స అనంతరం కొవ్వు కణాలు ఒకసారి క్రిస్టలైజ్‌డ్ అయ్యాక అవి చనిపోయి శరీరంలోంచి తొలగి పోతాయి. చికిత్స తరువాత మూడు వారాల్లోనే మంచి ఫలితాన్ని చూడవచ్చు. రెండు నెలల తరువాత పూర్తి మార్పు మీకు కనబడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement