
ఆర్ యూ రెడీ..!
పద పదవే గాలిపటమా పైన పక్షిలాగ ఎగిరిపోయే... అంటూ ఆనాడే పతంగ్‌ల వయ్యారాన్ని వర్ణించేశాడో కవి.
పద పదవే గాలిపటమా పైన పక్షిలాగ ఎగిరిపోయే... అంటూ ఆనాడే పతంగ్‌ల వయ్యారాన్ని వర్ణించేశాడో కవి. నీలి మబ్బుల్లో తోక ఆడిస్తూ... అలా అలా తేలిపోతూ... పెకైగిరి ఎగిరి చుక్కలా మారిపోతుంటే నిజంగానే మనసు ఎక్కడికో వెళ్లిపోతుంది. ఇక గగనంలో గిరికీలు కొట్టించే ఆటగాళ్లెవరో... తొడ కొట్టి ‘కోత’లేసే పోటుగాళ్లెవరో తేల్చుకునే సమయం రానే వచ్చేసింది.
సంక్రాంతి సంబరం అప్పుడే సిటీలో షురూ అయిపోయింది. కుప్పలు కుప్పలుగా గాలిపటాలు... పదునుదేలిన మాంజాలు రెడీ అయిపోయాయి. ధూల్‌పేట్... సికింద్రాబాద్... ఓల్డ్ సిటీ... న్యూ సిటీ... ఎక్కడ చూసినా లెక్కకు మించి పతంగ్‌లు సొగసులద్దుకుని ఆటగాళ్ల కోసం ఇదిగో... ఇలా ఎదురుచూస్తున్నాయి. ఆర్ యూ రెడీ!