అనుష్క కొత్త నిర్ణయం! | Anushka new decision! | Sakshi
Sakshi News home page

అనుష్క కొత్త నిర్ణయం!

Oct 28 2014 4:12 PM | Updated on Aug 17 2018 2:24 PM

అనుష్క - Sakshi

అనుష్క

భారీ ప్రాజెక్ట్స్‌తో క్షణం తీరికలేకుండా ఉన్న అనుష్క ఓ కొత్త నిర్ణయం తీసుకుంది.

గ్లామర్తో యూత్‌కి కిక్‌ ఎక్కించిన అనుష్కకు క్షణం తీరికలేదు. లేడీ ఓరీయంటెడ్ మూవీలతో బాక్సాఫీస్‌ రికార్డులను బ్రేక్ చేసింది. ఇటు టాలీవుడ్‌ని అటు కోలీవుడ్‌ని ఈ గద్వాల్ రాణి ఏలేస్తోంది. కింగ్ నాగార్జున సరసన 'సూపర్' సినిమాలో నటించి అనుష్క టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఒక వైపు గ్లామర్ రోల్స్‌లో నటిస్తూ మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే  టాప్ హీరోయిన్ రేంజ్కి చేరుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్స్‌లో  అనుష్క నటిస్తోంది. సినిమాల షూటింగ్ల కోసమే కాకుండా, ఆ పాత్రల కోసం రిహార్సల్స్ కోసం తెగ శ్రమిస్తూ క్షణం తీరికలేకుండా పని చేస్తోంది. టాలీవుడ్‌లో బాహుబలి, రుద్రమదేవి, కోలీవుడ్‌లో లింగా, అజిత్-గౌతమ్‌ మీనన్‌ సినిమాలతో అనుష్క  బిజీబిజీగా ఉంది.

భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగులో నటనకు ఆస్కారమున్న పాత్రలు, తమిళంలో  గ్లామర్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించాలని నిర్ణయం తీసుకుందట. తన మనసులోని మాటను దర్శకులకు, నిర్మాతలకు కూడా చెప్పేసినట్లు సమాచారం. ఇక నుంచి దర్శకనిర్మాతలు అనుష్కతో సినిమా తీయాలంటే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement