పప్పుధాన్యాలతో హైబీపీకి చెక్‌

Adding Cheap Lentils To Meals Could Combat High Blood Pressure - Sakshi

లండన్‌ : పప్పు ధాన్యాలతో హైబీపీని నియంత్రంచవచ్చని తాజా అథ్యయనంలో పరిశోధకులు వెల్లడించారు. కూరలు, సూప్స్‌లో వాడే పప్పుధాన్యాలు వయసుతో పెరిగే బీపీని కంట్రోల్‌ చేస్తాయని ఎలుకలపై చేసిన ప్రయోగంలో తేలింది. హైబీపీని చౌకగా దొరికే ఈ ధాన్యాలతో నియంత్రిచవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ మనితోబా అథ్యయనం పేర్కొంది.  పప్పుధాన్యాలు రక్తకణాల ఆరోగ్యం క్షీణించకుండా చూస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

డల్లాస్‌లో జరిగిన అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ వార్షిక సదస్సులో పరిశోధకులు తమ అథ్యయన ఫలితాలను వెల్లడించారని ది డైలీ ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించింది. బీపీ నియంత్రణలో పప్పుధాన్యాల పనితీరు అద్భుతంగా ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందని అథ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ పీటర్‌ జహ్రద్కా చెప్పారు. రక్త సరఫరాలో లోపాలపై నాన్‌ క్లినికల్‌ చికిత్సలో భాగంగా పప్పుధాన్యాలు ప్రభావవంతంగా పనిచేశాయని తెలిపారు. సకాలంలో గుర్తించి చికిత్స చేయకుంటే హైపర్‌టెన్షన్‌గా వ్యవహరించే హైబీపీ స్ర్టోక్‌లు, గుండెపోటుకు దారితీస్తుంది.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top