
ఈ వారం యూ ట్యూబ్ హిట్స్
అడేల్ బ్రిటిష్ గాయని. పాటల రచయిత్రి. ఆమె తాజా స్టూడియో ఆల్బమ్ ‘25’. అందులోని ఒక సాంగ్ ‘వెన్ వి వర్ యంగ్’. మూ
అడేల్ : వెన్ వి వర్ యంగ్
నిడివి : 5 ని. 42 సె.
హిట్స్ : 2,00,73,112
అడేల్ బ్రిటిష్ గాయని. పాటల రచయిత్రి. ఆమె తాజా స్టూడియో ఆల్బమ్ ‘25’. అందులోని ఒక సాంగ్ ‘వెన్ వి వర్ యంగ్’. మూడు రోజుల క్రితమే విడుదలైంది. చర్చి స్టూడియోస్‌లో లైవ్‌గా తీసిన ఈ సింగిల్ సాంగ్‌కి యూ ట్యూబ్‌లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. హిట్స్ రెండు కోట్లకు పైగా చేరుకున్నాయి. ‘నీ మాటను, నీ కదలికను ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు’ అంటూ పాట మొదలౌతుంది. వీడియోను చూస్తూ విన్నా, చూడకుండా పాట ఒక్కటే విన్నా మనసుకు ఎంతో హాయిగా, నెమ్మదిగా ఉంటుంది. అంత మంద్రస్థాయిలో పాడారు అడేల్.
గేరువా : ‘దిల్‌వాలే’ న్యూ సాంగ్
నిడివి : 4 ని. 47 సె.
హిట్స్ : 53,71,788షారుక్, కాజోల్ ఎటర్నల్ లవ్ కపుల్. చరిత్రలో నిలిచిపోయే బాలీవుడ్ ప్రేమ జంట. ‘దిల్‌వాలే’ చిత్రంతో ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులపై తమ ప్రేమ జల్లును కురిపించబోతున్నారు. ఆ సినిమాలోని మరో పాట ‘గేరువా’ ను సోనీ మ్యూజిక్ ఈవారం అప్‌లోడ్ చేసింది. మ్యూజిక్ ప్రీతమ్. గీత రచన అమితాబ్ భట్టాచార్య. షారుక్, కాజోల్‌ల హృదయాలను లయబద్ధంగా గానం చేసినవారు అరిజిత్ సింగ్, అంతర మిత్ర. సమ్ లవ్ స్టోరీస్ నెవర్ ఎండ్ అంటూ ఈ వీడియో సాంగ్ మొదలౌతుంది. ‘నీ కోసం ఈ అనంత విశ్వాన్ని పక్కకు నెట్టేశాను’ అని షారుక్ మొదలుపెడతాడు. మస్ట్ వాచ్ వీడియో.
బ్లైండ్ ఫోల్డెడ్ ముస్లిమ్ మేన్
నిడివి : 1 ని. 33 సె.
హిట్స్ : 21,59,487
పారిస్‌లోని ప్రధాన కూడలి అయిన ‘ప్లేస్ డి లా రిపబ్లిక్’లో ఒక ముస్లిం యువకుడు కళ్లకు గంతలు కట్టుకుని కాళ్ల దగ్గర రెండు అట్టముక్కలు పెట్టుకున్నాడు. ‘నేను ముస్లింను. కానీ టైస్టుని కాదు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరూ నన్ను నమ్ముతున్నట్లయితే నన్ను హత్తుకోండి’ అని వాటిపై రాసి ఉంది. అది చూసిన వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఎంతో హృద్యమైన ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో ఎందరినో ఆకట్టుకుంటోంది. ఎందరి చేతో కన్నీళ్లు పెట్టిస్తోంది. పారిస్‌లో ఉగ్రవాదులు దాడులు జరిపిన నేపథ్యంలో ఆ యువకుడు ఇలా ఒక చక్కటి మెసేజ్ ఇచ్చాడు.
జూల్యాండర్ 2 : ట్రైలర్
నిడివి : 2 ని. 34 సె.
హిట్స్ : 1,12,31,926
హాలీవుడ్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘జూల్యాండర్ 2’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న విడుదలౌతోంది. ఆ చిత్రం ట్రైలర్‌ను మూడు రోజుల క్రితమే పారామౌంట్ పిక్చర్స్ సంస్థ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. మోడల్స్ డెరిక్ జూల్యాండర్ (ఈ పాత్రను బెన్ స్టిల్లర్ పోషిస్తున్నారు. సినిమా డెరైక్టర్ కూడా ఆయనే), హ్యాన్సెల్ (ఉవెన్ విల్సన్).. ఇద్దరూ కలిసి ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తులందరినీ చంపేసే ఒక కుట్రను భగ్నం చేయడం కథాంశం. 2001లో వచ్చిన ‘జూల్యాండర్’ చిత్రానికి ఇది సీక్వెల్. హీరోయిన్స్ పెనెలోప్ క్రజ్, క్రిస్టైన్ టేలర్.. స్పెషల్ అట్రాక్షన్.
పింగా : ‘బాజీరావ్ మస్తానీ’ సాంగ్
నిడివి : 3 ని. 31 సె.
హిట్స్ : 48,46,664
యోధురాలైన మహాసామ్రాజ్ఞి మస్తానీకి.. సంగీత నృత్య రూపకాలతో కాశీబాయ్ స్వాగతం పలికే రాత్రి వేడుకల చిత్రీకరణ ఈ ‘పింగా’ సాంగ్. ఇందులో దీపికా పడుకోన్, ప్రియాంక చోప్రాల రాచవైభవ సౌందర్యం మంత్రముగ్ధులను చేసే విధంగా ఉంది! ఎరోస్ నౌన్ సంస్థ ద్వారా యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ అయిన బాజీరావ్ మస్తానీలోని ఈ పాటను శ్రేయాఘోషల్, వైశాలి ఆలపించారు. గీత రచన. సిద్ధార్థ గరిమ. ఇక కొరియోగ్రఫీ రెమో డి సౌజా కాబట్టి పాట ఎంత ఘనంగా ఉంటుందో ఊహించవచ్చు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించి, నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 18న విడుదలౌతోంది.
హీటెడ్ ఆర్గ్యుమెంట్ : రైల్వే టికెట్ కౌంటర్
నిడివి : 5 ని. 12 సె.
హిట్స్ : 12,56,667
కస్టమర్లకు, కార్యాలయాల సిబ్బందికి మధ్య వాగ్వాదాలు మామూలే. సిబ్బంది ఒత్తిడి సిబ్బందికి ఉంటుంది. కస్టమర్ల తొందర కస్టమర్లకు ఉంటుంది. దీంతో కొన్నిసార్లు చికాకులు, కోపాలు, ఆర్గ్యు మెంట్‌లు తప్పనిసరి అవుతాయి. ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ రైల్వే కౌంటర్లో ఈవారం జరిగిన ఇలాంటి ఒక ఆర్గుమెంట్‌నే ‘లాజికల్ ఇండియన్’ అనే ఆన్‌లైన్ కమ్యూనిటీ యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసింది. ప్రయాణికుడికి, టికెట్ కౌంటర్‌లోని మహిళా ఉద్యోగికి మధ్య జరిగిన వాదోపవాదాలు, అవి రేపిన ఆగ్రహావేశాలను ఈ వీడియో చూపించింది.