మీ శరీరాకృతి ఎలాంటిది? | What your body? | Sakshi
Sakshi News home page

మీ శరీరాకృతి ఎలాంటిది?

Nov 19 2014 10:51 PM | Updated on Sep 2 2017 4:45 PM

మీ శరీరాకృతి ఎలాంటిది?

మీ శరీరాకృతి ఎలాంటిది?

భారతీయ మహిళల్లో చాలామందికి తమ శరీరాకృతికి తగ్గ దుస్తులను ఎంచుకోవడంలో సరైన అవగాహన ఉండదు.

భారతీయ మహిళల్లో చాలామందికి తమ శరీరాకృతికి తగ్గ దుస్తులను ఎంచుకోవడంలో సరైన అవగాహన ఉండదు. తమ శరీరాకృతి ఏ రకమైనదో తెలుసుకుంటే సంప్రదాయ, ఆధునిక దుస్తుల ఎంపికలో బోలెడంత గందరగోళాన్ని నివారించవచ్చు.
 
రౌండ్/ఓవల్/ఆపిల్ షేప్:


పిరుదులు, తొడల భాగం విశాలంగా ఉండే శరీరాకృతి గల వారంతా ఈ జాబితాలోకి వస్తారు. ఇలాంటి వారికి ‘అ’లైన్ డ్రెస్సులు, కుర్తాలు నప్పుతాయి. అయితే, ప్రత్యేకమైన ‘నెక్‌స్టైల్స్’ లేదా మెరిసే నెక్‌లైన్ బ్లౌజ్‌లు, టాప్స్.. ధరిస్తే ఎదుటివారి చూపులు పిరుదుల భాగం నుంచి మెడవైపుకు మళ్లుతాయి. హై నెక్స్, బిగుతుగా ఉండే వస్త్రధారణకు వీరు దూరంగా ఉండటం మేలు.
 
త్రికోణం/నలుచదరం/నిటారైన ఆకృతి:

ఈ తరహా శరీరాకృతి గలవారు పై నుంచి కిందవరకు నెంబర్ 1 లాగా కనిపిస్తారు. కాస్త విభిన్నంగా ఉండాలంటే తలకట్టుతో ఆ తేడా కూడా చూపించాలి. వీరు వదులుగా, బ్యాగీ లుక్‌తో ఉండే మంచి ఔట్‌ఫిట్స్ ఎంచుకోవాలి. సల్వార్, చుడీదార్, దేహాన్ని పట్టి ఉంచే స్కిన్నీ టైప్ దుస్తులను వీరు ధరించకూడదు.

అవర్‌గ్లాస్ (ఇసుక గడియారం) ఆకృతి:

ఈ దేహాకృతి గలవారు అన్నిరకాల దుస్తులనూ ధరించవచ్చు. అయితే వదులుగా ఉండే దుస్తులను ధరించకూడదు. శరీర సౌష్టవానికి చక్కగా అమరే దుస్తులను ఎంచుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. ఏ శరీరాకృతి గలవారైనా జార్జెట్, షిఫాన్ .. వంటి సిల్క్ దుస్తులకు బదులుగా ఖాదీ, కాటన్ వంటివి.. కొద్దిగా వదులుగా ఉండేలా డిజైన్ చేయించుకొని ధరిస్తే, హుందాగా కనిపిస్తారు.
 - విక్రాంత్ మక్కర్,
 రచయిత, ఫ్యాషన్ డిజైనర్
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement