మీ ఇల్లు చల్లగుండ | Tips for fresh air in home | Sakshi
Sakshi News home page

మీ ఇల్లు చల్లగుండ

May 7 2018 12:56 AM | Updated on May 7 2018 12:56 AM

Tips for fresh air in home - Sakshi

ఏసీ లేకుండానే ఇల్లు చల్లగా ఉండాలి. ఖర్చు ఎక్కువ కాకుండానే వీచే గాలి హాయి గొలపాలి. వేసవి ఎండల్లో ఇంట్లోని ఉక్కపోతకు, వడ గాడ్పులకు చెక్‌ పెట్టాలంటే.. ఈ టిప్స్‌ ఫాలో అవండి.
ఎండ వేళలో కిటికీలకు మందంగా ఉండే కర్టెన్లను వాడాలి. దీని వల్ల 30 శాతం వేడి గాలిని నిరోధించవచ్చు.
వాడకంలో లేని గదులను, వాటి తలుపులను మూసి ఉంచాలి. దీని వల్ల చల్లదనం త్వరగా తగ్గిపోదు.
టేబుల్‌ ఫ్యాన్‌ ముందు (గాలికి ఎదురుగా) ఐస్‌ ముక్కలు వేసి ఉన్న పాత్ర ఒకటి ఉంచితే దాని మీదుగా వీచే గాలి చల్లగా ఉంటుంది. గది కూడా చల్లబడుతుంది.
రెడీమేడ్‌ పరుపులు, దిండ్లు వాటి మీద వాడే సింథటిక్‌ దుప్పట్లు కూడా వేడిని పెంచుతాయి. వీటి స్థానంలో కాటన్‌ పరుపులు, దుప్పట్లను చేర్చాలి.
కూలర్‌ గాలి నేరుగా ఒంటికి కాకుండా నేలకు తగిలేలా సెట్‌ చేసుకోవడం వల్ల గది త్వరగా చల్లబడుతుంది. అలాగే నేల మీద పడక వేడిని తగ్గిస్తుంది.
క్యాండిల్స్, ఫ్లోరోసెంట్‌ బల్బులను ఈ కాలం వాడకపోవడం ఉత్తమం.
చివరిగా.. మీ ఇంట్లో మొక్కలున్నాయా? పెరట్లోవి సరే. ఇంట్లో కిటికీల దగ్గర, కర్టెన్‌ల దగ్గర! వాటి వల్ల కూడా మీ  ఇల్లు కూల్‌గా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement