మూఢనమ్మకమా? గాఢవిశ్వాసమా?

మూఢనమ్మకమా? గాఢవిశ్వాసమా?


సెల్ఫ్‌చెక్‌



సృృష్టి రహస్యాన్ని ఛేదించటానికి అనేక సంవత్సరాల శాస్త్రవేత్తల కృషికి ప్రయోగరూపం బిగ్‌బ్యాంగ్‌. ఒకవైపు మానవుని ఆయుష్షు పెంచటానికి రకరకాల ప్రయోగాలు, పరిశోధనలు, గ్రహాలపై నివాసానికి ప్రయత్నాలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు, విజయాలు చోటు చేసుకుంటుంటే ఇంకోవైపు మూఢ నమ్మకాలతో జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసుకొనే వారు ఎందరో ఉన్నారు. వీరు అపోహలతో, అనుమానాలతో విలువైన కాలాన్ని వృథా చేసుకుంటుంటారు. మీలో కూడ మూఢ నమ్మకాలకు స్థానం ఉందా? ఇది తెలుసుకోవాలంటే ఈ సెల్ఫ్‌చెక్‌ని టిక్‌ చేయండి.



1.     మీ నమ్మకాలను మూఢనమ్మకాలుగా పిలవటం  మీకిష్టం లేదు.

ఎ. అవును      బి. కాదు  



2.    ప్రయాణ సమయాల్లో పిల్లి, కుక్క లాంటి జంతువులో మరేదో ఎదురొస్తే మీ ప్రయాణాన్ని కాసేపు వాయిదా వేసుకుంటారు.

ఎ. అవును      బి. కాదు  



3.    మీ ఆచారాలవల్ల అమూల్యమైన సమయం వృథా అవుతోందన్న సత్యాన్ని గ్రహించలేరు.

ఎ. అవును      బి. కాదు  



4.    అదృష్టం, దురదృష్టాలను బలంగా నమ్ముతారు.

ఎ. అవును      బి. కాదు  



5.    అమావాస్య రోజుల్లో ప్రయాణాలను వాయిదా వేయటానికి గట్టిగా ప్రయత్నిస్తారు.

ఎ. అవును      బి. కాదు

 

6.    ‘పెళ్లికి ముందే జీవితభాగస్వామిని  చూడటం, మాట్లాడటం చాలా తప్పు.’ ఈ భావనతో మీరు ఏకీభవిస్తారు.

ఎ. అవును      బి. కాదు  



7.    నక్కలు, కుక్కలు అరిస్తే అరిష్టాలు జరుగుతాయని నమ్ముతారు.

ఎ. అవును      బి. కాదు  



8.    మంచి జరుగుతుందన్న నమ్మకంతో బలులను సమర్థిస్తారు.

 ఎ. అవును      బి. కాదు

 

9.    చేతబడి,  బాణామతి లాంటి ఆచారాల వల్ల అనుకున్నది సాధించగలమని వాదిస్తారు.

ఎ. అవును      బి. కాదు  



10.    హేతువాదులంటే మీకు గిట్టదు. మీ ఆచారాలకు ఎవరైనా అడ్డువస్తే అసలు సహించలేరు.

 ఎ. అవును      బి. కాదు  



మీరు టిక్‌ పెట్టిన సమాధానాలలో ‘ఎ’లు 7 దాటితే మీలో మూఢనమ్మకాలకు స్థానం ఉందని అర్థం. లేనిపోని భయాలు, అపోహలకు పెద్దపీట వేస్తూ వాస్తవాలను గ్రహించలేరు. ఇందులో చదువుకున్న వారూ ఉండొచ్చు. ఇలాంటి ఆచారాల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. కొన్నిసార్లు ప్రాణాలే పోవచ్చు.  కాబట్టి ఇటువంటి నమ్మకాలను వెంటనే వదిలివేయాలి. వీలైనంత ఎక్కువగా శాస్త్రీయదృక్పథాన్ని పెంచుకోవాలి.  ‘బి’ లు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీరు మూఢాచారాలకు దూరంగా ఉంటారు. నిర్థారణలేని విషయాలను పక్కకు తోస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top