
లండన్ : వయసు పెరిగే కొద్దీ మతిమరుపు పెరగడం సహజం. అయితే వ్యాయామంతో మెరుగైన జ్ఞాపకశక్తిని సొంతం చేసుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. ఫిట్‌నెస్ కొరవడటమే మతిమరుపుకు కారణమని పరిశోధకులు గుర్తించారు. ఆరోగ్యకరంగా ధృడంగా ఉన్న వృద్ధుల్లో మతిమరుపు ఛాయలే కనిపించలేదని పరిశోధకులు తేల్చారు. దశాబ్ధాల కిందటి విషయాలను సైతం వారు అలవోకగా చెప్పారని అథ్యయనంలో గుర్తించామని తెలిపారు.
శారీరక ఫిట్‌నెస్ మెరుగైతే మానసిక ఆరోగ్యం కూడా చక్కడా ఉంటుందని అథ్యయనంలో గుర్తించారు. సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన శారీరక ఆరోగ్యానికి ఫిట్‌నెస్ ప్రాధాన్యత, ఏరోబిక్ ఫిట్‌నెస్‌కు గుండె ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని పరిశీలించారు. వృద్ధుల శారీరక పటుత్వం ఎంత అధికంగా ఉంటే వారిలో జ్ఞాపకశక్తి అంత మోతాదులో ఉన్నట్టు తమ పరిశోధనలో వెల్లడైందని అథ్యయన రచయిత, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ స్కూల్ ఆఫ్ సైకాలజీకి చెందిన రచయిత డాక్టర్ కట్రిన సెగార్ట్ చెప్పారు.